Suicide : ప్రాణం తీసిన అసభ్యకర (Nu**) వీడియో..!

Suicide : ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు లోనైన సిఫార, స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం ఆమెను మానసికంగా కృంగదీసింది

Published By: HashtagU Telugu Desk
Couple Commits Suicide

Couple Commits Suicide

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు SC కాలనీకి చెందిన యువతి సిఫార (Young woman) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన నాగరాజు(Nagaraju)తో ఈమెకు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. అయితే ఆ సంబంధాన్ని ఉపయోగించుకుని, సిఫార వ్యక్తిగత న్యూడ్ వీడియోలను నాగరాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు లోనైన సిఫార, స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం ఆమెను మానసికంగా కృంగదీసింది.

Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్‌.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ

పోలీసుల నుంచి న్యాయం లభించకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన సిఫార, ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఎలుకల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించడం తో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధితురాలి మరణం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతుందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

సిఫార మరణవార్త వెలుగులోకి రాగానే, కుటుంబ సభ్యులు మరియు బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హాస్పిటల్‌కు చేరుకొని బంధువులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు న్యాయవాదులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  Last Updated: 13 Apr 2025, 08:02 PM IST