Site icon HashtagU Telugu

Tirumala Temple: భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న యువకుడు.. 75 నిమిషాల్లోనే కొండపైకి..!

Tirumala Temple

Ttd Board Members Meeting under Chairman YV Subbareddy

Tirumala Temple: ఓ యువకుడు తిరుమల శ్రీవారి (Tirumala Temple)కి నృత్య నీరాజనం సమర్పించారు. భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. భరతనాట్యం చేస్తూ ఓ యువకుడు నడక మార్గంలో బుధవారం తిరుమల చేరుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్‌ పి.కృష్ణవాసు శ్రీకాంత్‌ భరతనాట్య కళాకారుడు.శ్రీవారి మెట్టు మార్గం నుంచి భరతనాట్యం చేసుకుంటూ 75 నిమిషాల్లో తిరుమల చేరుకున్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్‌ పి కృష్ణవాసు శ్రీకాంత్‌ అనే వ్యక్తి భరతనాట్య కళాకారుడు. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో కృష్ణవాసు సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భరత నాట్య కళాకారుడైన కృష్ణవాసు బుధవారం (జులై 12) తిరుమలకు వెళ్లాడు. ఐతే నడుచుకుంటూ కాదు.. భరతనాట్యం చేసుకుంటూ వెళ్లాడు.

Also Read: Semiya Veg Cutlets : సేమియా వెజ్ కట్‌లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

శ్రీవారి మెట్టు మార్గం నుంచి కేవలం 75 నిమిషాల్లోనే అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మెట్టుమార్గంలో నడుస్తూ వెళ్తే గంటన్నర సమయం పడుతుంది. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నమని, అందుకే నృత్యం చేస్తూ వచ్చానని ఆయన వివరించారు. ఆయన్ను అందరూ ప్రశంసించారు. మంచి ప్రయత్నం అంటూ మెచ్చుకుంటున్నారు.