ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే నేతగా మరోసారి చాటిచెప్పారు. “దేశంలో భారీ కార్యక్రమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబు” అనే ప్రధాని మోదీ ప్రశంసను బాబు నిలబెట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yogandhra 2025) విశాఖపట్నంలో గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని సమర్థంగా కల్పించారు. నెల రోజుల ముందే సన్నాహాలు ప్రారంభించి, ప్రణాళిక బద్దంగా ప్రజల్లో యోగాపట్ల అవగాహన పెంచడం, వాటిలో స్వయంగా ప్రజలే భాగస్వాములు కావడం ఆయన విజన్‌కు నిదర్శనం. రెండున్నర కోట్ల మంది యోగాలో పాల్గొనడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రజలలో చైతన్యం, నమ్మకాన్ని ఏర్పరచినందుకు స్పష్టమైన సాక్ష్యం.
International Yoga Day : రాత్రి భోజనం తర్వాత యోగా చేయవచ్చా..?
యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమైన సాధనం. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద. ఇటువంటి యోగా కార్యక్రమాన్ని విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఆరోగ్యాంధ్ర’ కలను నిజం చేయడానికి యోగాంధ్ర అనే దశను నిర్మించారు. బలవంతంగా కాకుండా ప్రజలు స్వయంగా యోగాలో పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందనే దృక్పథంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.
Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్న రకుల్‌ప్రీత్ సింగ్ దంపతులు
యోగాంధ్ర విజయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ కీలక పాత్ర పోషించింది. లోకేష్ ప్రజల మధ్య చైతన్యం కల్పించి, ఈవెంట్‌ను సమర్ధంగా మానిటర్ చేశారు. యోగా ఇప్పుడు సామాన్య ప్రజలలోనూ చర్చనీయాంశం కావడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది అనే సందేశం ప్రజల్లో వ్యాపించడం యోగాంధ్ర విజయాన్ని సూచిస్తుంది. మొత్తంగా టీమ్ వర్క్, నాయకత్వ నైపుణ్యం, దృఢ సంకల్పం కలవడం వల్లే ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు స్థాయిలో స్థానం సంపాదించగలిగింది. ఇది కేవలం ఒక యోగా కార్యక్రమం కాదు – ఇది ఆరోగ్యభారతం దిశగా వేసిన శాశ్వతమైన అడుగు.