విశాఖపట్నం ఆర్కే బీచ్ (Visakhapatnam RK Beach) వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఈ వేడుక జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం బీచ్ ప్రాంతంలో లక్షలాది మంది పాల్గొని యోగాసనాలు వేసిన ఈ కార్యక్రమం రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణంగా నిలిచింది.
Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా మారిందన్నారు. ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని నెలకొల్పడం గొప్ప విషయమని, ప్రపంచంలోని 175 దేశాల్లో యోగా చేయడం భారత విజయం అని తెలిపారు. నేవీ నౌకలపై సైతం యోగాసనాలు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరితో కలిసి యోగా చేసి, విద్యార్థులతో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
HHVM : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..ఈసారైనా థియేటర్స్ లోకి వచ్చేనా.?
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. యోగా ప్రాచీన భారతీయ సంపద అని, రుగ్వేదం కాలం నుంచే దీని ప్రాముఖ్యతను భారత మేధావులు వివరిస్తూ వచ్చారని అన్నారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా మోదీ గారు ప్రాచుర్యం చేసారనీ, ఆదియోగి శివుడు, పతంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ యోగాసనాలు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే సెప్టెంబర్ నెలలో యోగా సూపర్ లీగ్ ప్రారంభమవుతుందని, యోగాను ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికలలో చేర్చే ప్రయత్నం జరుగుతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.