AP Results : ఏపీలో వైసీపీదే విజయం – మంత్రి రోజా ధీమా

ఏపీలో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జనం మరోసారి వైసీపీకి పట్టం కడతాకరి విశ్వాసం వ్యక్తం చేశారు

  • Written By:
  • Publish Date - June 2, 2024 / 12:43 PM IST

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన పోలింగ్ కు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ వచ్చేసాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంచెపుతాయో..? ఎవరు గెలుస్తారని చెపుతాయో..? తెలుసుకోవాలని అంత ఎదురుచూడగా…వారి ఎదురుచూపులు తెరదించుతూ అనేక సర్వే సంస్థలు తమకు అందిన రిపోర్ట్ ను తెలియజేసారు. ముఖ్యముగా ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అరా తీయగా..మెజార్టీ సర్వే సంస్థలు ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతున్నట్లు తేల్చి చెప్పాయి. ఈ ఎగ్జిట్ ఫలితాలతో కూటమి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ నేతలు , పార్టీ శ్రేణులు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాదు జూన్ 4 న వచ్చే ఫలితాలు చూడండి..మరోసారి అధికారంలోకి వచ్చింది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రోజా సైతం ఇదే ధీమా ను వ్యక్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రోజు మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జనం మరోసారి వైసీపీకి పట్టం కడతాకరి విశ్వాసం వ్యక్తం చేశారు. విజయంపై కొందరు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబట్టారని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో.. అదేవిధంగా వైసీపీ గెలుపును ఆపలేరని రోజా స్పష్టం చేశారు. జగన్ ముఖ్య మంత్రిగా రెండోసారి పదవి ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే రోజా ఈసారి ఓటమి చెందడం ఖాయమని అన్ని సర్వేలు చెప్పాయి.

Read Also : Sugarcane Juice: చెరుకు ర‌సం మంచిదా..? కాదా..?