Site icon HashtagU Telugu

YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’

Ycp Yuvathaporu

Ycp Yuvathaporu

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శిస్తూ వైఎస్సార్‌సీపీ, చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా (YSRCP Yuvatha Poru) కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలను ప్రారంభించింది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తున్నారు.

Jaspirt Bumrah: క్యాచ్‌లు వదిలించడంపై బుమ్రా స్పందన: “నిరాశగా ఉన్నా, డ్రామా చేయను”

వైఎస్సార్‌సీపీ వర్గాల ప్రకారం.. టీడీపీ ప్రభుత్వం నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా జాబ్ క్యాలెండర్‌ విడుదల, 20 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను ఇచ్చినా, ఏడాది పూర్తయ్యే సమయంలోనూ వాటిలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలని ప్రకటించిన నిరుద్యోగ భృతికి ఇప్పటిదాకా బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం వల్ల ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయిలు నమోదయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది.

Stock Market : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. స్టాక్ మార్కెట్లు కుదేల‌… చమురు ధరలు చుక్కల్లోకి..!

అంతేకాదు విద్యారంగానికి సంబంధించిన హామీల అమలు విషయంలోనూ ప్రభుత్వం పూర్తి విఫలమైందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనలు పేరుతో రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను తీవ్రంగా నష్టపరిచారని విమర్శిస్తున్నారు. విదేశీ విద్యా పథకం కింద ఒక్కరికీ కూడా సాయం అందలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్పులు చేసి బాగోతానికి బానిసలవుతున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హామీల అమలుపై వైసీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశముంది.