Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రతిపక్షనేత హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు.
Read Also: Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయండి. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు. వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ రెండు గంటల సేపు ప్రసంగించారని… ఆయన ప్రసంగాన్ని అడ్డుకుకోవడానికి వైసీపీ యత్నించడం దారుణమని అన్నారు. వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పారు.
ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, సనాతన ధర్మం కోసం తమిళనాడు ప్రభుత్వం కూడా పోరాడుతోందన్నారు. వక్స్ బోర్డు ఉన్నప్పుడు సనాతన ధర్మం బోర్డు ఉంటే తప్పా అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై మార్చి 14 న మాట్లాడతానని తెలిపారు.
Read Also: India vs Pak Match : కేసీఆర్ ను కోహ్లీ రికార్డు తో పోల్చిన మంత్రి కొండా సురేఖ