Site icon HashtagU Telugu

Free Sand Supply : అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడం బాబు నైజం – వైసీపీ ట్వీట్

Ycp Isuka

Ycp Isuka

ఏపీ ఎన్నికల ఫలితాల (AP Election Results) తర్వాత కాస్త సైలెంట్ అయినా వైసీపీ (YCP)..మళ్లీ పుంజుకుంటుంది. అధికార పార్టీ కూటమి ఫై విమర్శలు , ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టిన బాబు..తాజాగా ఫ్రీ ఇసుక (Free Sand Supply Launched in Andhra Pradesh) ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో ఆనందం నింపింది. అయితే ఈ ఫ్రీ ఇసుక ఫై వైసీపీ కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది.

చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయరని, అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడం బాబు నైజమని వైసీపీ ఆరోపించింది. ఫ్రీ ఇసుక అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.. పేరుకే ఉచిత ఇసుక విధానమని.. దీని పేరుతో కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారని కీలక ఆరోపణలు చేసింది. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్‌యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఒకసారి చూస్తే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర టన్ను ఇసుక. రూ.1225లు, విశాఖనగరంలో ఉన్న అగనంపూడి డిపోవద్ద టన్ను ఇసుక రూ.1394లు, అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిపోవద్ద వద్ద టన్ను ఇసుక ధర రూ.1125లు దాదాపు ఇవే రేట్లతో వైసీపీ నియోజకవర్గాల్లో ఇసుక అందించిందని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను వైసీపీ అందించిందని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.750 కోట్లు చేరిందని, ఇప్పుడు ఈ డబ్బు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై టీడీపీ అంతే ఘాటుగా స్పంధించింది. అవును ఇసుక ఫ్రీనే.. ఇసుకకి రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే, జగన్‌ను అసెంబ్లీలో మొదటి బెంచీలో కూర్చోపెట్టమని, చంద్రబాబుకు రిఫర్ చేస్తామని తెలిపింది. నువ్వు ఎంత విష ప్రచారం చేసినా, ఉచిత ఇసుక తీసుకునే ప్రజలకు తెలుసని, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు తెలుసని.. నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే, అంత దిగజారుతావంటూ టీడీపీ మండిపడింది.

Read Also : Curry Leaves: కరివేపాకే కదా అని పక్కన పెట్టేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?