ఏపీలో వైసీపీ ఫ్యాన్ (YCP) రెక్కలు పూర్తిగా విరిగిపోయేస్థితికి వచ్చాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా..ఇక ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాక్ కు తాడేపల్లి ప్యాలెస్ బోసిపోతుంది. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు..పార్టీని వీడిని సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫలితాలు అనంతరం కూడా వలసలు అలాగే కొనసాగాయి. మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ ఇలా కీలక నేతలు టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా…ఇక ఇప్పుడు సర్పంచ్ ల వంతు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ సర్పంచ్ లు ఫ్యాన్ కు బై బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కు గుడ్ బై చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలంలో ఎనిమిది గ్రామాల సర్పంచులు తాజాగా పార్టీ మారారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. మరోపక్క కూటమి శ్రేణులు వైసీపీ నేతలపై , ఆ పార్టీ అనుచరులపై వరుసగా కేసులు పెడుతూ వస్తున్నారు. దీంతో వారంతా వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరు కేసు పెడతారో..ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
Read Also : Nara Ramamurthy Naidu Final Rites : మరికాసేపట్లో రామ్మూర్తి అంతిమయాత్ర..