YCP Policing : పుంగ‌నూరులో త‌ప్పంతా టీడీపీదేన‌ట‌.!

`గ‌దిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుంద‌ని` నానుడి. ఏపీలో ఇప్పుడు (YCP Policing) అలాంటి పరిస్థితి నెల‌కొంది.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 02:49 PM IST

`గ‌దిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుంద‌ని` నానుడి. ఏపీలో ఇప్పుడు (YCP Policing) అలాంటి పరిస్థితి నెల‌కొంది. టీడీపీ క్యాడ‌ర్ ను అణ‌చివేయ‌డానికి వైసీపీ పోలీసుల‌ను వాడుకుంటోంది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌లుమార్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ఘ‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ శ్రేణుల మ‌ధ్య రాళ్ల దాడి జ‌రిగింది. కానీ, టీడీపీకి చెందిన 50 మందిని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. ఇలా అణ‌చివేసే కొద్దీ టీడీపీ క్యాడ‌ర్ తిరుగుబాటు మ‌రింత ఎక్కువ అవుతుంది.

టీడీపీకి చెందిన 50 మందిని అరెస్ట్ (YCP Policing)

తొలిసారి జైలుకు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డ‌తారు. పోలీసుల లాఠీల దెబ్బ‌కు త‌డుస్తారు. ఆ త‌రువాత `పోరాడితే పోయేదేమీలేదు, బానిస సంకెళ్లు` త‌ప్ప అనే శ్రీశ్రీ కొటేష‌న్ మాదిరిగా నిర్ణ‌యానికి వ‌స్తారు. ఆ త‌రువాత టీడీపీ క్యాడ‌ర్ ను పోలీసులు  (YCP Policing) ఆప‌లేరు. అమెరికా సైన్యాన్ని మించిన విధంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల సంఖ్య ఉంది. వాళ్లంద‌రూ తిర‌గుబాటు చేస్తే పరిస్థితి మ‌రోలా ఉంటుంది. గ‌త నాలుగేళ్లుగా అధికార‌ప‌క్షం అణ‌చివేత‌తో విసిగిపోయారు. ఆగ్ర‌హాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు లోలోప‌ల దాచుకున్నారు. దాన్ని గ‌ట్టుదాటించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోన్న వైసీపీకి ఇక చుక్క‌లు చూపిస్తార‌ని పుంగ‌నూరు ఎపిసోడ్ చెబుతోంది. అందుకే, లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడాల్సిన పోలీసులు ఇప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎన్నిక‌ల ఏడాదిలోకి అడుగుపెడుతోన్న స‌మ‌యంలో ఒన్ సైడ్ నిర్ణ‌యాలు ప్ర‌మాదంలోకి నెట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

మరో 200 మందిని అరెస్టు చేసే అవకాశం

చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ఎపిసోడ్ కు బీజం పుల‌వెందుల‌లో ప‌డింది. అది తంబ‌ళ్ల‌ప‌ల్లెలో మొక్క‌గా మొద‌లై పుంగ‌నూరు వ‌ద్ద బ‌ద్ద‌ల‌యింది. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని ‘రావణుడు’ అంటూ చంద్ర‌బాబు సంబోధించారు. ములకలచెరువులో జరిగిన ర్యాలీ సంద‌ర్భంగా ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్య‌లు చేశారు. దాని ప్ర‌భావం పుంగ‌నూరు వ‌ద్ద బ‌య‌ట‌ప‌డింద‌ని ఎస్పీ చెబుతున్నారు. రాళ్లదాడి, దహనానికి పాల్పడిన 50 మందిని అరెస్టు చేసిన‌ట్టు (YCP Policing) ఆయ‌న చెబుతున్నారు. పైగా వాళ్లంద‌రూ టీడీపీ వాళ్ల‌ని అధికారికంగా వెల్ల‌డించారు. హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ఫుటేజీలను పరిశీలించి మరో 200 మందిని అరెస్టు చేసే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు.

Also Read : India TV-CNX : ఏపీలో మ‌ళ్లీ YCP, తెలంగాణ‌లో BRS! జాతీయ‌ స‌ర్వే మాయ‌!!

రాళ్లదాడి, దహనాల్లో కనీసం 20 మంది పోలీసులు, ప్రతిపక్ష టీడీపీతో పాటు అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు మద్దతుదారులు గాయపడ్డారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా మరో 150 నుండి 200 మందిని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల కోసం 300 మంది పోలీసులను,ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుంచి మోహ‌రించారు. ఆమేర‌కు చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వై రిశాంత్ రెడ్డి వెల్ల‌డించారు.రాళ్లు, బీరు సీసాలు, కర్రలు, ఇతర వస్తువులతో మహిళా పోలీసులతో సహా పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వాళ్లను పోలీసులు గుర్తించారు. విచిత్రంగా ఆరెస్ట్ అయిన‌ వారంతా టీడీపీకి చెందిన క్యాడ‌ర్. ర్యాలీ పుంగనూరు చేరుకోవడానికి ముందు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన ఘర్షణ అల్లకల్లోలానికి కారణమైంద‌ని పోలీసులు చెబుతున్నారు. అల్ల‌ర్ల‌లో 2,000 మంది వ్యక్తులు పాల్గొన్నారు. 50 మంది పోలీసులు గాయపడ్డారు, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read : Jagan Punganuru : 30ఏళ్ల పాటు సీఎం క‌ల ఫ‌లితం `పుంగ‌నూరు` ఎపిసోడ్ ?

వివిధ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నాయుడు ‘యుద్ధ భేరి’ పర్యటనలో ఉన్నారు. టీడీపీ మద్దతుదారులు పట్టణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అంటే, పోలీసులు చెబుతోన్న దాని ప్ర‌కారం ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణంగా చంద్ర‌బాబును ఫిక్స్ చేస్తున్నారు. దాడికి పాల్ప‌డిన వాళ్లంద‌రూ టీడీపీ వాళ్ల‌ను రికార్ట్ ల్లోకి ఎక్కించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న‌ట్టు క్లియ‌ర్ గా క‌నిపిస్తుంటే, కేవ‌లం టీడీపీ వాళ్ల‌ను మాత్ర‌మే పోలీసులు అరెస్ట్ చేయ‌డం అధికార‌ప‌క్ష అణ‌చివేత‌గా టీడీపీ భావిస్తోంది. ఇలా అణ‌చివేస్తూ ఉంటే, రాబోవు రోజుల్లో వైసీపీ అనుకుంటోన్న విధంగా టీడీపీ క్యాడ‌ర్ భ‌య‌ప‌డ‌ద‌ని ఆ పార్టీ చెబుతోంది.