Site icon HashtagU Telugu

YCP MP Vijayasai Reddy: చంద్ర‌బాబువి ఊస‌ర‌వెళ్లి రాజకీయాలు.. విజ‌య‌సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్

YCP MP Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy: ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ కీల‌క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్ చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తన అవసరాలకు తగినట్టుగా చంద్రబాబు వేషాలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు.

తాజాగా విజ‌య‌సాయి రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేశారు. “వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది.. తదుపరి (Next).. అర్జంట్‌గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్.. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి.. ఊసరవెల్లి రాజకీయాలు” అంటూ ఘాటు విమర్శలు చేశారు. విజ‌య‌సాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read: RSS Chief : విభేదాలను పక్కనపెట్టి హిందువులు ఏకం కావాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వానికి, వైసీపీకి తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వివాదం న‌డుస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్ర‌బాబు ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌ను వైసీపీ సైతం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై వ‌రుస పెట్టి ప్రెస్ మీట్‌లు పెట్టి త‌మ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ జ‌ర‌గ‌లేదని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందుకోస‌మే వైవీ సుబ్బారెడ్డితో జ‌గ‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ కూడా వేయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఐదుగురు స‌భ్యులతో సిట్ ఏర్పాటు చేసి నిజాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని సూచించింది. తిరుమ‌ల ల‌డ్డూ విష‌య‌మై రాజ‌కీయ నాయ‌కులెవ‌రూ కూడా స్పందించ‌కూడ‌ద‌ని సుప్రీం కోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొన్న విష‌యం తెలిసిందే.