YCP MP Tweet : పురంధ‌రేశ్వ‌రిపై వైసీపీ వార్ షురూ

పురంధ‌రేశ్వ‌రి (YCP MP Tweet)హ‌డావుడి మొద‌లైయింది. ఆమె ఫ్లెక్సీలు క‌నిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు.

  • Written By:
  • Updated On - July 29, 2023 / 02:19 PM IST

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి (YCP MP Tweet)హ‌డావుడి మొద‌లైయింది. ఆమె ఫ్లెక్సీలు రాష్ట్రంలో క‌నిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. రాష్ట్రం కోసం ప‌నిచేయండ‌ని చుర‌క‌లు వేశారు. ప్లెక్సీల్లో క‌నిపిస్తోన్న జోరు విశాఖ ప్రైవేటీక‌ర‌ణ అడ్డుకోవ‌డం, రైల్వే జోన్, ఇండిస్ట్రీయ‌ల్ కారిడార్ సాధించ‌డంలో చూపాల‌ని హితవు ప‌లికారు. ఆయ‌న పార్ల‌మెంట్ వేదిక‌గా మునుపెన్న‌డూ లేనివిధంగా ప్ర‌త్యేకహోదా మీద గ‌ళం విప్పారు. మోడీ ప్ర‌భుత్వాన్ని రాజ్య‌స‌భ‌లో నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి హ‌డావుడి(YCP MP Tweet)

మెజార్టీ ఎంపీలను ఇస్తే ప్ర‌త్యేక హోదా కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీ. దాన్ని న‌మ్మిన జ‌నం 22 మంది ఎంపీల‌ను వైసీపీకి ఇచ్చారు. సీన్ క‌ట్ చేస్తే, దేవుడి ద‌య ఉంటే ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాలుక మ‌డ‌త పెట్టారు. అంతేకాదు, కేంద్రానికి వైసీపీ అవ‌స‌రంలేదు క‌నుక ప్ర‌త్యేక హోదా మీద గ‌ట్టిగా మాట్లాడ‌లేమ‌ని తేల్చేశారు. ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా బీజేపీ అనేక మార్లు చెప్పారు. కేంద్ర మంత్రులు కూడా వివ‌రించారు. ఆ సంద‌ర్భంగా పార్ల‌మెంట్లో ఉన్న వైసీపీ ఎంపీలు  (YCP MP Tweet)సావ‌దానంగా విన్నారు. ఎక్క‌డా నిర‌స‌న వ్య‌క్తం చేయ‌లేదు.

ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాలుక మ‌డ‌త

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌త్యేక హోదా కావాల‌ని వైసీపీ ఎంపీలు రాజ్య‌స‌భ‌లో సాయిరెడ్డి, లోక్ స‌భ‌లో భ‌ర‌త్ వాయిస్ వినిపించారు. తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పురంధ‌రేశ్వ‌రిని కూడా ప్ర‌త్యేక‌హోదా మీద మాట్లాడాల‌ని (YCP MP Tweet)డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆమె జిల్లాల‌కు ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. తొలుత ప్రాంతాల వారీగా స‌మావేశాల‌ను పెట్టారు. జిల్లా, మండ‌ల క‌మిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. పార్టీని యాక్టివేట్ చేయ‌డానికి ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందుకే కాబోలు, ఒక పార్టీలో ఉంటూ మ‌రొక పార్టీకి ప‌నిచేయ‌డం మానుకోవాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా సాయిరెడ్డి ఘాటుగా పురంధ‌రేశ్వ‌రి మీద ట్వీట్లు పెట్టారు.

టీడీపీకి ప‌నిచేస్తున్నారంటూ ప‌రోక్షంగా  పురంధ‌రేశ్వ‌రి మీద విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్

వాస్త‌వంగా బీజేపీ, వైసీపీ రెండూ ఒక‌టే. ఆ రెండు పార్టీలు కేంద్ర‌, రాష్ట్రాల్లో ఇచ్చిపుచ్చుకునేలా ప‌నిచేస్తున్నాయి. ఆ క్ర‌మంలో పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బీజేపీకి సంపూర్ణ మ‌ద్ధ‌త‌ను వైసీపీ ఇస్తోంది. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి బ‌హిరంగంగా మ‌ద్ధ‌తును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్టే ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే ప్ర‌తి బిల్లుకూ మ‌ద్ధ‌తు ఇచ్చేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపీల‌కు  (YCP MP Tweet)దిశానిర్దేశం చేశారు. అంటే, కేంద్రంలో వైసీపీ, బీజేపీ రెండూ క‌లిసి పనిచేస్తున్నాయ‌న్న‌మాట‌.

Also Read : YCP Party: కోడిగుడ్లకు వైసీపీ రంగులు.. ఇదేమీ ప్రచారం అంటున్న జనం

రాష్ట్ర రాజ‌కీయ చ‌ద‌రంగంలో మాత్రం బీజేపీ, వైసీపీ వేర్వేరుగా అనే సంకేతం తీసుకెళుతున్నారు. గతంలోనూ ఇదే పంథా కొన‌సాగింది. అందుకే, ఎన్డీయే లో భాగ‌స్వామి కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద. ఒత్తిడి వ‌చ్చింది. ప‌లు సంద‌ర్భాల్లో కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌ను ఆఫ‌ర్ కూడా చేసింది. ఆయిన‌ప్ప‌టికీ క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు కోసం బీజేపీతో అధికారికంగా క‌ల‌వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్దంగా లేరు. కానీ, మోడీతో రాజ‌కీయాల‌కు అతీతంగా బంధం ఉంద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా, బీజేపీని టార్గెట్ చేస్తూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు (YCP MP Tweet) పెట్ట‌డం వెనుక రాజ‌కీయ చ‌తుర‌త ఉంది.

Also Read : CM Jagan: సిట్టింగ్స్ కు జగన్ షాక్.. పుత్రరత్నాలకు నో టికెట్స్?

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కుమార్తు పురంధ‌రేశ్వ‌రి. వివిధ కార‌ణాల‌తో ఆమె కాంగ్రెస్ పార్టీలో 10ఏళ్లు ప‌నిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆ పార్టీలో ప‌నిచేశారు. ఆ త‌రువాత బీజేపీలో చేరారు. ఆ స‌మ‌యంలో వైసీపీలో ఆమె భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే ఇంటిలో రెండు పార్టీలు ఉన్న‌ప్పుడు కూడా విజ‌య‌సాయిరెడ్డి ఇప్పుడు చేసినంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. బీజేపీలో ఉంటూ టీడీపీకి ప‌నిచేస్తున్నారంటూ ప‌రోక్షంగా ఆమె మీద విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేయ‌డం ఏపీ రాజ‌కీయాల్లో దుమారం రేపుతోంది.