Site icon HashtagU Telugu

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి..

YCP Mp Srinivasulu Reddy change as Approver to ED in Delhi Liquor Case

YCP Mp Srinivasulu Reddy change as Approver to ED in Delhi Liquor Case

గత కొన్ని రోజులుగా సౌత్ టు నార్త్ చాలా మంది నాయకులని వణికిస్తోంది ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case). అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్టు, ముఖ్యంగా ఇవి తెలుగు రాష్ట్రాల నుంచే ఢిల్లీకి జరిగినట్టు ED గుర్తించి ఇప్పటికే అనేకమందిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ కేసులో ఏపీ వైసీపీ ఎంపీలు, కేసీఆర్ కూతురు కవిత, ఢిల్లీ ఆప్ నాయకుల పేర్లు, ఇంకా చాలామంది రాజకీయ నాయకుల పేర్లు వచ్చాయి.

ఇప్పటికే ఈ కేసులో EDకి పలువురు అప్రూవర్స్ గా మారగా తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(MP Magunta Srinivasulu Reddy) కూడా అప్రూవర్ గా మారడంతో తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు కేసుకు సంబంధించిన కీలక సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అప్రూవర్ గా మారి ఉన్నాడు. ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు.

శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ప్రశ్నించాలని ఈడీ ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి జరిగిన అక్రమ నగదు బదిలీలపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసింది. ప్రస్తుతం దర్యాప్తు సబ్దుగా వున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోంది అని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్ గా దూకుడు పెరుగుతుందని, తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు వెల్లడించాయి.

గత కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందికి పైగా కీలక వ్యక్తులను పిలిచి ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల మరో మారు ఈడీ ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో మరికొంతమందిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరి ఈ లిక్కర్ కేసులో ఇంకెంతమంది పెద్దవాళ్ళ పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

 

Alsoi Read : TDP Loyalty : చంద్ర‌బాబు నిప్పంటూ కేశినేని స‌ర్టిఫికేట్