Site icon HashtagU Telugu

Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!

Tweet By TDP

Tweet By TDP

Tweet By TDP: ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఒక‌వైపు కార్య‌క‌ర్త‌లపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మీడియా ముందుకు వ‌చ్చి చెబుతున్నారు. మ‌రోవైపు త‌మ‌కు దాడుల‌తో ఎటువంటి సంబంధం లేద‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడుతుంది. అయితే తాజాగా ఇవీ కాకుండా ఏపీలో మ‌రో టాపిక్ హాట్ హాట్‌గా మారింది. ఆ టాపికే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్ర‌మ సంబంధం మేట‌ర్‌.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆయ‌న కుటుంబంతో కాకుండా వేరే మ‌హిళ‌తో నివాసం ఉంటున్నాడ‌ని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు. ఈ విష‌య‌మై దువ్వాడ ఇంటి ముందు నిర‌స‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద హైడ్రామా చోటుచేసుకుంది. దువ్వాడ‌ను క‌లిసేందుకు ఆయ‌న భార్య‌, కూతురు ఇంట్లోకి వెళ్లేందుకు సాహసించారు. ఈ క్ర‌మంలోనే తీవ్ర‌స్థాయిలో గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే దువ్వాడ త‌న భార్య వాణిపై దాడి చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అక్క‌డే ఉన్న పోలీసులు దువ్వాడ‌ను అదుపు చేశారు.

Also Read: Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్

ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ త‌న భార్య వాణిపై సంచ‌ల‌న ఆరోపణలు చేశారు. తనను చంపడానికి భార్య ప్రయత్నిస్తోందని, తాను చనిపోతే ఇంటిని లాక్కోవాల‌ని చూస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. హ‌త‌మార్చ‌డానికి మ‌ర‌ణాయుధాలు వెంట తెచ్చుకున్నార‌ని ఆరోపించారు. భార్య వాణి వెన‌క అధికార ప‌క్షం నాయ‌కులు ఉన్నార‌ని, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ‌లితం లేకుండా పోయింద‌ని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు దువ్వాడ‌తో ఉంటున్న మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. వాణికి భ‌ర్త‌తో ఉండాల‌ని లేద‌ని ఆరోపించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని మాధురి చెప్పారు.

పార్టీ నిండా రౌడీలు, సైకోలేనా?: టీడీపీ

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ విష‌యంపై టీడీపీ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ (Tweet By TDP) చేసింది. “పార్టీ నిండా రౌడీలు, ఖూనీకోరులు, డెకాయిట్లు, సైకోలు, కామాంధులని పెట్టుకుని, సేవ్ డెమోక్రసీ అంటున్న నిన్ను ఏమనాలి వైఎస్ జ‌గ‌న్‌..? అసలు నీది ఒక రాజకీయ పార్టీయేనా?” అని టీడీపీ ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో దువ్వాడ పారిపోతున్న‌ట్లు ఉన్న ఫొటోను యాడ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.