ఏపీలో ఎన్నికల (Elections) వేడి సమ్మర్ వేడి కంటే ఎక్కువగా ఉంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారానికి జోరు పెంచాయి. ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బిజెపి – టిడిపి – జనసేన పొత్తుగా బరిలోకి దిగుతుంటే, కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీలోకి దిగుతుంది. ఇక మరికొన్ని పార్టీలు సైతం ఎన్నికల పోటీలోకి దిగబోతున్నాయి. దీంతో ప్రజలకు వరుస హామీలతో పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ (TDP Manifesto) కూటమి సూపర్ సిక్స్ తో ప్రజల్లోకి వెళ్లగా..రేపు అధికార పార్టీ వైసీపీ (YCP) తన మేనిఫెస్టో (YCP Manifesto) ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
రేపు (మార్చి 12) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్న పార్టీ అధినేత , సీఎం జగన్. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో సూపర్ గా ఉండబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. ఈసారి ఎక్కువగా ఉచిత హామీల ఫై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత హామీలే కావడం తో జగన్ కూడా అదే బాటలో పయనించబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న అద్దంలో జరిగిన బహిరంగ సభలో మేనిఫెస్టో ఫై జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని.. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని.. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూడాలి.
Read Also : Ananthapuram : తన కళ్లముందే భర్త హత్య..కాసేపటికే ఆమె గుండెపోటుతో మృతి..