Site icon HashtagU Telugu

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు..?

YSR Congress Party

YSR Congress Party

YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో ఈ నెల 26న తాడెపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో సిఎం జగన్‌(CM JAGAN) విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోసారి అధికారంలోకి వస్తే..ఏం చేస్తామనే అంశం పై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని పలు జనాకర్షణ పథకాలను ప్రకటిస్తారని సమాచారం తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ ఇప్పటికే ఏపీలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయి. మళ్లీ సీఎంగా జగన్ అధికారంలోకి వస్తే.. మరింత మేలు చేకూరుస్తాయనే ధీమాలో ఉన్నారు. మరోవైపు ఎలాగైనా చంద్రబాబు అధికారంలోకి రావాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకు ఇటు జనసేన.. అటు బీజేపీ మద్దతు ఉండటంతో ఎలాగైనా అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నామని పేర్కొన్నారు.

Read Also: World Book Day 2024: పిల్లల్లో పుస్తకాలను చదివే అలవాటును ఎలా పెంపొందించాలి?

కాగా, రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజుకు చేరింది.

Read Also: Arvind Kejriwal : మే7 వరకు కేజ్రీవాల్‌ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు