Lokesh : తప్పు చేసిన వైసీపీ నేతలు తప్పించుకోలేరు : మంత్రి లోకేశ్

2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు.

Published By: HashtagU Telugu Desk
Minister Lokesh

Minister Lokesh

Lokesh : మంత్రి నారా లోకేశ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ..తప్పు చేసిన వైసీపీ నేతలు శిక్షలు తప్పించుకోలేరని లోకేశ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అరాచక పాలనను అందరూ చూశారని, ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని స్పష్టం చేశారు. వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

Read Also: Revanth Reddy Meets Rahul Gandhi : గంటలో రాహుల్ – రేవంత్ ఏం చర్చించారంటే..!

ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఎలక్షన్ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ అరెస్టుతో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ఆ తర్వాతి అరెస్టు ఎవరన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొడాలి నానిని విడిచి పెట్టేది లేదంటూ ఎన్నకల ప్రచార సమయంలో లోకేష్ అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొడాలి నాని హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.

Read Also: CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు

 

  Last Updated: 15 Feb 2025, 06:13 PM IST