పోసాని కృష్ణ మురళి అరెస్ట్ (Posani Krishna Murali Arrest) పై యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే…కొంతమంది వైసీపీ శ్రేణులు (YCP Leaders ) తప్పుబట్టాన్ని ఛీ అనేలా చేస్తుంది. రచయితగా మంచి పేరున్న పోసాని..వైసీపీ మాయలో , జగన్ డబ్బులో పడిపోయి అధికార మదంతో చంద్రబాబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ లను ఇష్టంవచ్చినట్లు రాయలేని తీరులో బూతులు మాట్లాడి సభ్యసమాజం తలదించుకునేలా చేసాడు. రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవాలా? అధికార మదం నెత్తి కెక్కితే – ప్రవర్తన ఇలా ఉంటుందా? అనే రీతిలో పోసాని వ్యవహరించారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, మాటలు తక్కువ, బూతులు ఎక్కువ. ఎదుటివాడు ఎంతటివాడైనా తనకు నచ్చకపోతే బూతు పురాణం విప్పేస్తుంటారు. ఆయన్ని రచయితగానో, నటుడిగానో, దర్శకుడిగానో అభిమానించినవాళ్లు సైతం.. వీడెక్కడి మెంటలోడు అని అనుకునేవారు. ఏదొక రోజు పోసాని మూల్యం చెల్లించుకోకతప్పదు అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఆరోజు వచ్చింది.
AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్- పూర్తి వివరాలు
పోసాని చేసిన పాపాలకు బదులు చెప్పుకోవాల్సిన రోజు వచ్చింది.ఇప్పుడు ఆయన వెనుక ఒక్కడంటే ఒక్కడూ లేడు. కనీసం `అయ్యో.. పోసానికి ఇలా జరిగిందేంటి` అని బాధ పడిన మనిషీ కనిపించడం లేదు. పోసానిని మీడియా ముందుకు పంపి, ఆ చోద్యం చూసి పైశాచిక ఆనందం పొందిన వాళ్లు సైతం ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు అని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. గతంలో పోసాని వాడిన బూతులు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇలాంటి వాడికి తగిన శాస్తి జరగాల్సిందే’ అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆఖరికి వైసీపీ లోని కొంతమంది ”పోసాని వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు కూడా అతన్ని సమర్థిస్తే మరింత మునిగిపోతాం” అనే వారు కూడా ఉన్నారు. కానీ అంబటి రాంబాబు , రోజా మరికొంతమంది వై’ చీప్’ నేతలు మాత్రం పోసాని ని సమర్థిస్తూ వారికీ వారు ప్రజల్లో దిగజార్చుకుంటున్నారు. ఇప్పటికైనా బూతులు తిట్టే వారికీ , తిట్టాలని ఎంకరేజ్ చేసే వారి వెనుక ఉండడం మానేసి మంచి కోసం ఆలోచించే నేతలకు మద్దతు తెలిపితే కాస్తయినా గుర్తింపు ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.