YCP Leader Spilled Urine On Janasena Flag : ఏపీ(AP)లో అధికారంలో ఉన్నప్పుడే..కాదు ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా వైసీపీ నేతల (YCP Leaders)అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో ప్రభుత్వ అండ..అధికార పార్టీ ఎమ్మెల్యేల ధైర్యం తో జనసేన, టిడిపి నేతల ఫై , ఇండ్ల ఫై దాడులు చేయడం..కార్యకర్తలను హింసించడం వంటివి చేసి పైశాచికానందం పొందారు. ఇక ఇప్పుడు అధికారంలో లేకపోయినా, అధికారంలో కూటమి సర్కార్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా చేస్తున్నారు. తాజాగా నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను వైసీపీ నాయకుడు అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
జనసేన పార్టీ జెండాపై మూత్రం
వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హార్ష (Harsha)..ఆగిరిపల్లి సెంటర్‌లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ..రోడ్ పక్కన ఉన్న జనసేన నేత మహేష్ కార్ ను చూసి .. రివర్స్ వచ్చి కారు ఫై ఉన్న జనసేన పార్టీ జెండాపై మూత్రం పోసి ( Spilled Urine On Janasena Flag) పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన అక్కడ సీసీ కెమెరా లో రికార్డు అయ్యింది. దీనిపై మహేష్ (Mahesh) ..పోలీసులకు పిర్యాదు చేసాడు. వైసీపీ నాయకులు పలు రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆగ్రహావేశాలకు గురికాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని..డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైందని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : BRS faults Telangana Govt’s decision : పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదు – దానం నాగేందర్