Site icon HashtagU Telugu

YCP is not Single : సింహం సింగిల్ కాదు, ఆయ‌న‌కు ముగ్గురు..!

Ycp Is Not Single

Ycp Is Not Single

YCP is not Single :   ` సింహం సింగిల్ గా వ‌స్తుంది.పందులే..గుంపుగా వ‌స్తాయి..` ఈ డైలాగు ఇప్పుడు రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినిపిస్తోంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సింహంగా ఆ పార్టీ భావిస్తోంది. మిగిలిన పార్టీలు అన్నీ క‌లిసి వ‌చ్చినా సింహంలాంటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఏం పీక‌లేవ్ అనే ధీమా ఆ పార్టీది. కానీ, ఎప్పుడూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేదా రాజ‌శేఖ‌ర్ రెడ్డి సింగిల్ గా రాజ‌కీయాలు చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త పార్టీ పెట్ట‌లేదు. ఆయ‌న ఇత‌రుల పార్టీని తీసుకున్నారు. ఆ పార్టీతో 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటూ పాద‌యాత్ర‌కు దిగారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్ర‌జ‌ల్ని వేడుకున్నారు. ప‌రోక్షంగా కేసీఆర్, మోడీ మ‌ద్ధ‌తు తీసుకున్నారు. ఇంకా మాట్లాడాలంటే, ఎంఐఎం అండను పొందారు. అంటే మూడు పార్టీల మ‌ద్ధ‌తుతో 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సింహంగా పోల్చుకోవ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

మోడీ, కేసీఆర్ ద‌యాదాక్షిణ్యాల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (YCP is not Single)

ఇక స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 2004 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి క‌మ్యూనిస్ట్ లు, టీఆర్ఎస్ పార్టీ పొత్తు కార‌ణం. ఆ త‌రువాత 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టించ‌డం ద్వారా ప‌రోక్ష మ‌ద్ధ‌తును పొందారని రాజ‌కీయ స‌ర్కిల్స్ లో వినిపించే మాట‌. ఇలా ఎప్పుడూ సింగిల్ గా ఫెయిర్ గేమ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, స్వ‌ర్గీయ వైఎస్ ఆడ‌లేదు. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా పొత్తులు పెట్టుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల చ‌రిత్ర‌ను చూస్తే డైరెక్ట్ పొత్తుల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లింది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలో ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తుతో ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు హ‌యాంలో బీజేపీతో పొత్తుపెట్టుకుని 1999, 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో ప‌రోక్ష మ‌ద్ధ‌తు ఎవ‌రి నుంచి తీసుకోలేదు.

బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్ధ‌తును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప‌రోక్ష మ‌ద్ధ‌తును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ (YCP is not Single) నుంచి పొందుతోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా కేసీఆర్ ప్ర‌చారం చేశారు. హైద‌రాబాద్ కేంద్రంగా చంద్ర‌బాబు మీద దుమ్మెత్తిపోశారు. సాంకేతికంగా , ఆర్థికంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్ని విధాలు స‌హ‌కారం అందించారు. ఆయ‌న ఇచ్చిన మ‌ద్ధ‌తును ప‌రోక్షంగా కూడా చూడ‌లేం. ప్ర‌త్య‌క్షంగానే అండ‌గా నిలిచారు. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా టీడీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చారో, అదే త‌ర‌హాలో 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచారు. ప‌రిపాల‌నలో కూడా బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్ధ‌తును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితులు ఉండ‌గా, సింహం సింగిల్ గా వ‌స్తుంద‌ని ఎలా వైసీపీ చెబుతుంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

ప్ర‌జాస్వామ్యంలో పొత్తులు స‌హ‌జం

ప్ర‌జాస్వామ్యంలో పొత్తులు అనేవి స‌హ‌జం. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కోవ‌డానికి విప‌క్షాలు అన్నీ ఏక‌మ‌య్యాయంటే వ్య‌తిరేక‌త ఎంత‌? అనేది ఆలోచించుకోవాలి. విప‌క్ష కూట‌మికి వ‌చ్చిన ఓట్ల కంటే అధికార‌ప‌క్షానికి  (YCP is not Single) త‌క్కువే ఉంటాయి. అంటే, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు విప‌క్షాల‌కు ఎక్కువ‌. ఆ విష‌యాన్ని గ‌మ‌నించికుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేవలం అధికారంలో ఉన్నామ‌న్న భావ‌న‌తో ఏక‌ప‌క్షంగా రూలింగ్ చేస్తున్నారు. ఆ విష‌యాన్ని హైకోర్ట్ ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన రాకేష్ గుర్తు చేశారు. అంతేకాదు, రూల్ ఆఫ్ లా ఎక్క‌డా లేద‌ని సుప్రీం కోర్టుకు స‌మాచారం అంద‌చేశారు. కేవ‌లం మీడియా ప్ర‌చారంతో నెట్టుకొస్తోన్న జ‌గన్మోహ‌న్ రెడ్డి వాస్త‌వ పాల‌న మీద ప‌లు విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

Also Read : Brahmani Key Role in TDP : చైత‌న్య ర‌థం ఎక్క‌నున్న బ్ర‌హ్మణి? బ‌స్సు యాత్ర షురూ!!

మైండ్ గేమ్ ఆడ‌డంలో కేసీఆర్ ను మించినపోయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విచిత్రంగా సింగిల్ గా ఎన్నిక‌ల‌కు వ‌స్తున్నానంటూ చెబుతున్నారు. ప‌రోక్షంగా మోడీ, కేసీఆర్, అస‌రుద్దీన్ మ‌ద్ధ‌తు లేకుండా రాగ‌ల‌రా? అనేది విప‌క్షాల ప్ర‌శ్న‌. ఆయ‌న ధైర్యం ఉంటే, వాళ్ల మ‌ద్ధ‌తు లేకుండా ఎన్నిక‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫేస్ చేయ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. తెర‌చాటు గేమాడుతూ సింగిల్ గా వ‌స్తున్నాడంటూ ప్ర‌చారాన్ని వైసీపీ తీసుకొస్తోంది. నిజంగా అన్ని పార్టీల బ‌లం కంటే వైసీపీ బ‌లం ఎక్కువ అనే భావాన్ని వ్యూహాత్మ‌కంగా ఆ పార్టీ లీడ‌ర్లు తీసుకెళుతున్నారు. వాస్తవంగా మోడీ, కేసీఆర్ ద‌యాదాక్షిణ్యాల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని విప‌క్ష లీడ‌ర్ల విమ‌ర్శ‌. ఆ ముసుగు తొల‌గించుకుని సింగిల్ గా వ‌స్తే అప్పుడు సింహం సింగిల్ అనే ప‌దం వాడేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అర్హులు అంటూ ఆరోపిస్తున్నారు. సో…ఈసారైనా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫెయిర్ గేమాడ‌తార‌ని ఆశిద్దాం.!

Also Read : I Am With CBN : చంద్ర‌బాబు అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా మ‌త్స్య‌కారుల ఆందోళ‌న‌