Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్లడం వల్ల జగన్‌కు, పార్టీ తీవ్ర నష్టం జరిగినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ఆయన తెలిపారు. తనలాంటి వాళ్లు వెయ్యి మంది వెళ్లినా జగన్‌కు ఆదరణ తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయడానికి ముందు జగన్‌తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. దైవ భక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను.. అందుకే తప్పుకుంటున్నానని వివరించారు. విజయసాయి రెడ్డి ప్రాతినిథ్యాన్ని ఎవరూ తగ్గించలేరని అన్నారు.
నాకంటే గొప్పగా ఆలోచించే వ్యక్తులకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. తనపై 22 కేసులు ఉన్నాయని.. ఎప్పుడూ భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టంచేశారు. పదవికి రాజీనామా చేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని విజయసాయి రెడ్డి అన్నారు. సీటు కూటమికి వస్తుందని తెలిసే తెలిసే రాజీనామా చేశానని తెలిపారు. వైసీపీ కోసం 2014 నుంచి సర్వశక్తులూ వినియోగించానని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశానని పేర్కొన్నారు. తాను వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. అబద్ధాలు చెబితే దేవుడు శిక్షిస్తాడని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు తిరుమలకు వస్తే ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. తాను వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఇంకా ఉన్నారని.. భవిష్యత్తులో వస్తారని తెలిపారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పనని ఆయన అన్నారు.
Read Also: ICC Men’s T20I Team: ఐసీసీ 2024 అత్యుత్తమ T20 జట్టు ఇదే.. కెప్టెన్‌గా టీమిండియా స్టార్!