Site icon HashtagU Telugu

Pawan : డిప్యూటీ సీఎం..కక్ష సాధింపుల పై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి – వైసీపీ

Deputy CM Pawan Kalyan left for Delhi

Deputy CM Pawan Kalyan left for Delhi

వైసీపీ పార్టీ (YCP)..పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై స్పందిస్తూ..పవన్ కళ్యణ్ ను టార్గెట్ చేసింది. తిరుపతి(శనివారం) జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..ఆపై హత్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనపై వైసీపీ స్పందిస్తూ సంచలన ట్వీట్ చేస్తూ.. కూటమి ప్రభుత్వం(AP Government) పై విమర్శలు గుప్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కక్ష సాధింపుల పై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్విట్టర్(YCP Twitter) వేదికగా వ్యాఖ్యానించింది. మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి నేతలు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ స్పందిస్తేనే కూటమి నేతలు బాధిత కుటుంబాల వద్దకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని రోజూ రుజువవుతుంది. రాష్ట్రంలో 120కి పైగా ఘటనలు మహిళలపై జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు జిల్లాలోనే మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. తిరుపతిలో మరో బాలికపై అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లితండ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? అంటూ వరుదు కల్యాణి ప్రశ్నలు గుప్పించారు.

Read Also : Insulin Resistance : ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినాలి!