ఏపీలో టీడీపీ (TDP) పార్టీకి పూర్తి స్థాయిలో పూర్వ వైభవం రాబోతుంది. గతంలో టీడీపీ వీడి వైసీపీ (YCP) లో చేరిన నేతలు , కార్యకర్తలు ఇలా అంత కూడా మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటాలను సైతం టీడీపీ బద్దలు కొట్టగా..ఇప్పుడు చిన్న చితక వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు వారం కిందటే రాజీనామా చేయగా… వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావును నేడు చైర్మన్ గా ఎన్నుకున్నారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉండగా… ఇటీవలే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీకి ఎదురులేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఇప్పుడు కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు.
Read Also : Big shock for Jagan : ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..