ఒంగోలు(Ongole)లో వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆ పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు (YCP Corporators) చేరనున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతోనే.. ఒంగోలులో ఆ పార్టీ నిర్వీర్యమైందనే వాదన వినిపిస్తోంది. అనంతరం ఆయన వైసీపీ ఖాళీ చేయించే పనిలో ఉన్నారని సమాచారం.
Tollywood : యంగ్ ప్రొడ్యూసర్ మృతి
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్‌లో 41 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం 19 మంది కార్పొరేటర్లు, మేయర్ కలిసి.. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన కార్పొరేటర్లు.. బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారంత ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనలో చేరుతోన్న ఈ కార్పొరేటర్లకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూసారా..?
మరోవైపు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వరుస చర్చలు జరుపుతోన్నారు. ఆ క్రమంలో పలువురు జనసేనలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అసంతృప్తి నేతలను హైదరాబాద్ పిలుపించుకొని వారితో చర్చించి.. జనసేనలో చేరేలా వారిని ఒప్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేయాలనే ఓ విధమైన లక్ష్యంలో బాలినేని ముందుకు వెళ్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.