ఏపీలో వైసీపీ (YCP) పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 175 కు 175 సాధిస్తామని చెపుతూ వచ్చిన వైసీపీ నేతలకు ప్రజలు కోలుకోలేని షాక్ ఇవ్వగా..ఇక ఇప్పుడు సొంత పార్టీ నేతలు షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్రం అధికారం మారిందంటే రాజకీయ నేతలు కూడా తమ కండువాలు మార్చుకుంటారు. ఇది ఎప్పుడు జరిగేది. ఇక ఇప్పుడు వైసీపీ లో కూడా అదే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది నేతలు ఓటమి గ్రహించి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు ఓటమి తరువాత ఇంకా వైసీపీ లో ఉండడం ఎందుకని..వరుసగా పార్టీ మారుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా వైజాగ్ లో వైసీపీ కి భారీ షాక్ తగిలింది. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు (YCP Corporators Join TDP) ‘సైకిల్’ ఎక్కారు. కార్పొరేటర్లు గోవింద్, కంపా హనూక్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పలరత్నం, రాజారామారావు, వరలక్ష్మి లు పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ ఏడుగురు కార్పొరేటర్లకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు. వీరు మాత్రమే కాదు చాలామంది కార్పొరేటర్లు జనసేన , టీడీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
Read Also : Ram Charan : అలా అయ్యేవరకు RC16 షూటింగ్ మొదలు కాదట..!
