ఏలూరు(Eluru)లో జరిగిన సాక్షి మీడియా కార్యాలయ అగ్నిప్రమాదం (Sakshi Office Fire Accident) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై టీడీపీ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవంగా ఈ కార్యాలయానికి నిప్పు పెట్టింది వైసీపీ శ్రేణులే (YCP) అని ఆరోపిస్తూ, సీసీ ఫుటేజ్‌ను కావాలనే మాయం చేసారని ఆరోపిస్తున్నారు. గతంలో తాడేపల్లిలో జరిగిన అదే తరహా ఘటనను గుర్తు చేస్తూ, జగన్ నివాసం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో కూడా సీసీ ఫుటేజ్‌ను ఇవ్వకుండా దాచారని ..ఇప్పుడు అదే తరహాలో సాక్షి ఆఫీస్ అగ్ని ప్రమాద సీసీ ఫుటేజ్ కనిపించకుండా చేస్తున్నారని వాపోతున్నారు.
Kommineni : ఛీ.. కొమ్మినేనిని వెనకేసుకొచ్చిన జగన్
వైసీపీ ఈ ఘటనను టీడీపీ మీదకు తోసే కుట్రలో భాగంగా చేస్తున్నదని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమరావతి మహిళలపై జరిగిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచిపించేలా ప్రజా దృష్టిని మళ్లించేందుకు జగన్ ఈ కొత్త డ్రామాకు తెర తీసినట్లు ఆరోపిస్తున్నారు. గతంలో పాలస్ గార్డెన్‌కు తానే నిప్పు పెట్టుకుని బాధ్యతను టీడీపీ మీదకు నెట్టినట్లు, ఇప్పుడు సాక్షి కార్యాలయానికి తామే నిప్పు పెట్టుకుని ఇదే స్క్రిప్ట్‌ను పునరావృతం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. డీకే శివకుమార్ కీలక ప్రకటన
రాష్ట్రంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న టీడీపీ ప్రభుత్వం చేపట్టిన “సుపరిపాలన సంవత్సరం” వేడుకలను అడ్డుకోవడానికే ఈ విధ్వంసాలకు వైసీపీ శ్రేణులు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల ముందు వైసీపీ డ్రామాలు నిలబడవని, కుట్రల ద్వారా ప్రజా గౌరవం పొందే ప్రయత్నం వృథా అని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘చీప్ పాలిటిక్స్ మానేయండి, మంచి పాలన చేయండి. ప్రజల నమ్మకాన్ని దక్కించుకోండి’’ అంటూ వారు వైసీపీ కి సూటిగా సందేశం ఇస్తున్నారు.
మొత్తం మీద రాజధాని అంశంపై కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు..ఇప్పుడు టీడీపీ vs వైసీపీ గా మారింది. ఒకరిపై ఒకరు నిందలు , ఆరోపణలు , విమర్శలు చేసుకోవడమే కాకుండా..దాడుల వరకు వెళ్లారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు.