ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించారు. పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్ఛార్జ్ మహీధర్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా తప్పించింది.
We’re now on WhatsApp. Click to Join.
పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన చేసింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్లేస్ లో మహిళా నేత అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు. పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపించకపోయేసరికి ఆ ప్లేస్ లో ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు.
ఇక ఇప్పటివరకు ఆరు జాబితాల్లో విడుదల చేసిన స్థానాలు చూస్తే..
తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంచార్జ్ లను, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలను, ఏడో జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు.
Read Also : Rajdhani Files : రాష్ట్ర ప్రజలంతా “రాజధాని ఫైల్స్” చూడండి – చంద్రబాబు పిలుపు