Y Not Jagan : అమ్మో..YS ఫ్యామిలీ! DK వెనుక‌ `వై నాట్ క‌ర్ణాట‌క `!!

`.వైఎస్ త‌ర‌హాలో క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్(Y not Jagan)  చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.`

  • Written By:
  • Updated On - May 17, 2023 / 04:06 PM IST

`స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డిలాగా క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్(Y not Jagan)  చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.` అంటూ వైఎస్సా ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల (Sharmila) కితాబు ఇచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లను లైట్ తీసుకుంటే పొర‌బాటే. ఫ‌క్తు రాజ‌కీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె చేసిన వ్యాఖ్య‌ల వెనుక చాలా ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఎందుకు డీకేను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. దానికి స‌మాధానం వెదుక్కుంటే చాలా స‌మాధానాలు రావ‌డం స‌హ‌జం. ఎందుకంటే, బెంగుళూరుకు వైఎస్ కుటుంబానికి ఉన్న వ్యాపార, వాణిజ్య‌, రాజ‌కీయ సంబంధాలు అంద‌రికీ తెలిసిన‌వే.

రాజ‌శేఖ‌ర్ రెడ్డిలాగా క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్(Y not Jagan)

దేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్మోహన రెడ్డి. (Y not Jagan) మిగిలిన రాష్ట్రాల్లోని 28మంది సీఎంల మొత్తం ఆస్తి కలిపినా జగన్ ఆస్తికన్నా తక్కువే. ఆంధ్రప్రదేశ్ ను 4ఏళ్లలో రూ 11లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఆయ‌న మాత్రం దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగారు. అందుకే “బెంగళూరులోని 28ఎకరాల విస్తీర్ణంలో ఎలహంక ప్యాలెస్, హైదరాబాద్ లో 60వేల చ అడుగుల్లో లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, వేల ఎకరాల ఇడుపుల పాయ ఎస్టేట్, రూ 60వేల కోట్ల విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం, రూ వేల కోట్ల భారతి సిమెంట్స్, వేల కోట్ల మీడియా సామ్రాజ్యం, తండ్రి 5ఏళ్ల పాలనలో 1100% పెరగడం, ఇప్పుడీ 4ఏళ్ల తన పాలనలో ల్యాండ్-శాండ్ మాఫియా, వైన్-మైన్ మాఫియాతో ఇంకెన్ని వేల రెట్ల సంపద పెరిగిందో..? పేదరాష్ట్రానికి ధనిక సీఎంగా గర్వపడాలా..? లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని, ప్రజలను ముంచాడని బాధపడాల్నా..?“అనే నినాదంతో ఒక సంక్షుప్త స‌మాచారం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కార‌ణాలు అనేకం.

దేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్మోహన రెడ్డి

క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్, స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అప్ప‌ట్లో అత్యంత స‌న్నిహితులు. ఢిల్లీ అధిష్టానం వ‌ద్ద రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద్వారా రాజ‌కీయంగా డీకే చాలా ల‌బ్ది పొందారని వాళ్లిద్ద‌రి గురించి తెలిసిన వాళ్ల‌కు అవగాహ‌న ఉంటుంది. అంతేకాదు, ఏపీ సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Y not Jagan) క్విడ్ ప్రో కో వ్య‌వ‌హారాన్ని న‌డిపార‌ని విప‌క్షాలు చేసే ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఆ క్విడ్ ప్రో కోను డీకే స‌హాయ‌, స‌హ‌కారాల‌తో బెంగుళూరు కేంద్రంగా అప్ప‌ట్లో పెద్ద ఎత్తున న‌డిపార‌ని రాజ‌కీయ స‌ర్కిల్స్ లో వినిపించేది. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి స‌న్నిహితంగా మెలిగే డీకేతో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల‌కు సాన్నిహిత్యం ఉంది. ఆ క్ర‌మంలో డీకే సీఎం కావాల‌ని ఇద్ద‌రూ త‌ల‌పోశారు. బెంగుళూరులోని విలువైన ఆస్తుల సంర‌క్షణ‌కు డీకే ప‌రిపాల‌న బాగా ఉంటుంద‌ని భావించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని మాట‌. అందుకే, ఆయ‌న సీఎం కావ‌డానికి మ‌ద్ధ‌తుగా ఆయ‌న క‌ష్టాన్ని ష‌ర్మిల(Sharmila) మీడియా ముఖంగా గుర్తించారు. డీకే లేకుండా క‌ర్ణాట‌క కాంగ్రెస్ లేద‌న్న‌ట్టు ఫోక‌స్ ఇచ్చార‌ని టాక్‌.

డీకే ఒక గ్రూప్ ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు.( Y not Jagan)

ఇక డీకే ఎన్నిక‌ల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగిన హోట‌ల్ లోనే ఒక రాత్రి విడిది చేశారు. ఆ రోజు ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రిగింద‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఆ ర‌హ‌స్య భేటీకి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లైజ‌నింగ్ చేశార‌ని సిద్ది రామ‌య్య వ‌ర్గీయుల్లోని అనుమానం. తాజా ప‌రిణామాలు వాళ్లిద్ద‌రి భేటీలోని అంశాల‌కు అనుగుణంగా క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ర‌హ‌స్య ఎజెండాను తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా సిద్ధి రామ‌య్య‌కు సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే, రాబోవు రోజుల్లో డీకే( Y not Jagan) ఒక గ్రూప్ ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు తీసుకెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎంతో కాలం నిల‌వ‌కుండా జేడీఎస్ , బీజేపీ అండ్ డీకే గ్రూప్ ఎమ్మెల్యేలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని నిఘా వ‌ర్గాల స‌మాచారం.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల చేదోడువాదోడుగా

అక్ర‌మాస్తులు ఉన్నాయ‌ని డీకే శివ‌కుమార్ మీద సీబీఐ కేసు ఉంది. సేమ్ టూ సేమ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Y not Jagan) మీద ఎలాంటి కేసులు ఉన్నాయో, అలాంటివే డీకే మీద కూడా ఉన్నాయ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌సారి జైలుకు వెళ్లొచ్చిన డీకే మీద 19 కేసులు వివిధ సెక్ష‌న్ల కింద ఉన్నాయి. వాటి విచార‌ణ వేగ‌వంతం చేయ‌డానికి సీబీఐ బాస్ గా ప్ర‌వీణ్ సూద్ ను క‌ర్ణాట‌క ఫలితాలు వెలువ‌డిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే నియ‌మించారు. అంటే, డీకే మెడ మీద బీజేపీ క‌త్తి పెట్టింద‌ని ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చీల్చుకుని వ‌స్తే సీఎం ప‌ద‌వితో పాటు కేసుల విచార‌ణ ఉండ‌దు. అలాకాకుండా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయితే, జైలు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. అందుకే, సీఎం ప‌ద‌వి ప్ల‌స్ జైలు లేకుండా క్షేమంగా ఉండ‌డానికి క‌నీసం 30 మంది ఎమ్మెల్యేల‌కు త‌గ్గ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చే ఏర్పాట్లు డీకే చేస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల(Sharmila) చేదోడువాదోడుగా ఉన్నార‌ని కూడా డీకే, వైఎస్ కుటుంబీకుల మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం తెలిసిన వాళ్ల‌లోని అనుమానం.

Also Read : Jagan Speech: జగన్ స్పీచ్ లో ‘ముందస్తు’ స్వరం

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని(Sharmila) కాంగ్రెస్లో విలీనం చేస్తున్నార‌ని కూడా బ‌లంగా వినిపించింది. ఆ టాక్ రావ‌డానికి కూడా కార‌ణం లేక‌పోలేదు. క‌ర్ణాట‌క‌లో డీకే మాదిరిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Y not Jagan) వైఎస్ కుటుంబం చూస్తోంది. సామాజిక‌వ‌ర్గం కోణంలో చూస్తూ రాబోవు ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేయాల‌ని ష‌ర్మిల కోరుకోవ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే, చాలా మంది అనుకుంటున్న‌ట్టు చంద్ర‌బాబు ద్వారా రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి రాలేద‌ని, డీకే లైజ‌నింగ్ ద్వారా మాత్ర‌మే వ‌చ్చింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. ఎందుకంటే స్వ‌ర్గీయ వైఎస్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ఉన్న సూర్యుడు ద్వారా డీకేను అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి క‌లిశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఢిల్లీలోనూ వైఎస్ కు ఉన్న బ‌ల‌మైన లాబీయింగ్ ను సూర్యుడు ద్వారా రేవంత్ రెడ్డి రాబ‌ట్టార‌ని అప్ప‌ట్లో వ‌చ్చిన సోష‌ల్ మీడియా న్యూస్. దానికి బ‌లం చేకూరేలా రేవంత్ రెడ్డి రైతు పాద‌యాత్ర స‌భ ముగింపు వేదిక‌పై సూర్యుడు క‌నిపించాడు. అప్యాయంగా ఆ వేదిక‌పై ఆలింగ‌నం చేసుకుని ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు.

Also Read : Jagan Hindu : చెప్పుల‌తో జ‌గ‌న్ యాగ‌శాల‌లోకి.! ఇదేం సంప్ర‌దాయం?

ఇలా ఒక్కో అంశాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే, డీకే శివ‌కుమార్ ను వైఎస్ కుటుంబం ఎందుకు ప్ర‌మోట్ చేస్తుందో అర్థ‌మ‌వుతోంది. బెంగుళూరు కేంద్రంగా జ‌రిగే తెలుగు రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా డీకే(Y not Jagan) ఉంటారు. పైగా ఢిల్లీ నుంచి వైఎస్ కుటుంబం వ‌ర‌కు డీకే బంధాలు పెనువేసుకున్నాయి. ఆ దృష్ట్యా స్వ‌ర్గీయ వైఎస్ క‌ష్టంతో డీకే క‌ష్టాన్ని పోల్చారని లోట‌స్ పాండ్ లోని టాక్‌. ఒక వేళ కాంగ్రెస్ లో చీలిక వ‌స్తే , దాని వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లైజ‌నింగ్ బీజేపీ త‌ర‌పు నుంచి ఉంటుంద‌ని బ‌లంగా న‌మ్మే క‌ర్ణాట‌క కాంగ్రెస్ వ‌ర్గీయులు ఉన్నారు. సో, తెలుగు రాష్ట్రాలే కాదు వై నాట్ క‌ర్ణాట‌క దిశ‌గా వైఎస్ కుటుంబం లాజిక్ ఉంద‌ని ష‌ర్మిల(Sharmila) వ్యాఖ్య‌ల వెనుక ఉంద‌న్న‌మాట‌.