Wonderful Project : అద్భుత ఘ‌ట్టంలో జ‌గ‌న్‌ సోద‌ర‌భావం! పాల‌మూరు-రంగారెడ్డి కేసీఆర్ వ‌రం!!

Wonderful Project : తెలంగాణ రాష్ట్రం స‌స్య‌శ్యామలం కావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అద్బుత స‌హ‌కారం అందిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:01 PM IST

Wonderful Project : తెలంగాణ రాష్ట్రం స‌స్య‌శ్యామలం కావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అద్బుత స‌హ‌కారం అందిస్తున్నారు. అన్న‌ద‌మ్ముల్లా తెలుగు రాష్ట్రాల‌ను ప‌రిపాలిస్తోన్న కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ ఒకే పంథా, ఒకే రాజ‌కీయం. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చేయ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన కేసీఆర్ ప్ర‌తిగా స‌చివాల‌యం బిల్లింగ్ లు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా చేసుకోగ‌లిగారు. అంతేకాదు, గోదావ‌రి జలాల‌ను పై భాగాన తోడేయ‌డానికి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఫ‌లితంగా తెలంగాణ‌కు కొత్త స‌చివాల‌యం కాంతులీనుతోంది. కాళేశ్వరం గ‌ల‌గ‌లా పారుతోంది.

తెలంగాణ రాష్ట్రం స‌స్య‌శ్యామలం కావ‌డానికి ఏపీ సీఎం (Wonderful Project)

ఇప్పుడు కృష్ణా జలాల‌ను తోడేసే పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్  (Wonderful Project) ప్రారంభానికి సిద్ద‌మైయింది. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి బ‌హుశా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాక‌పోవ‌చ్చు. అంతేకాదు, ఆయ‌న‌కు ఆహ్వానం కూడా కేసీఆర్ పంప‌క‌పోవ‌చ్చు. ఇరు రాష్ట్రాల్లో ఉండే తాజా ప‌రిణామాల క్ర‌మంలో ఇప్పుడు ఇద్ద‌రూ రాజ‌కీయంగా దూరం ఉండొచ్చు. కానీ, అన్న‌ద‌మ్ముల్లా ఉండే కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిపుచ్చుకునే క్ర‌మంలోనే పాల‌మూరు-రంగారెడ్డి పూర్త‌యింది. కాళేశ్వ‌రం రూపంలో గోదావ‌రి నీళ్ల‌ను పైగాభాగాన తోడేస్తోన్న కేసీఆర్ ఇప్పుడు కృష్ణా నీళ్ల‌ను తోడేయ‌డానికి బాహుబ‌లి మోటార్ల‌ను త‌ల‌ద‌న్నే ఇంజ‌న్లను అమ‌ర్చారు. వాటి ప్రారంభోత్స‌వానికి ముహూర్తంగా ఈనెల 16వ తేదీని ఫిక్స్ చేశారు. కాళేశ్వ‌రం బాహుబ‌లి మోటార్ల‌ను మించిన మోటార్ల ను నార్లాపూర్ ఇన్ టేక్ వెల్ వ‌ద్ద కేసీఆర్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా ప్రారంభిస్తారు. ఆ అద్బుతఘ‌ట్టాన్ని చూడ్డానికి తెలంగాణ స‌మాజం ఎదురుచూస్తోంది.

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో 12.3లక్షల ఎకరాలకు సాగునీరు

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో 12.3లక్షల ఎకరాలకు సాగునీరు అంద‌నుంది. కృష్ణానదీ జలాలను పాతాళం నుంచి బ‌య‌ట‌కు తోడ‌నున్నారు. దీని ప‌రిధిలో మొత్తం ఐదు రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. వాటికి అంజ‌నాగిరి, ఏదుల వీరంజనేయ, వ‌ట్టేం వెంకాటాద్రి, క‌రివెన కురుమూర్తిరాయ‌, ఉద్దండాపూర్ రిజ‌ర్వాయిర్లగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ ప్రాజెక్టులో 34 మహా బాహుబలి మోటార్లు అమ‌ర్చారు. వీటి ద్వారా రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. మొత్తం 120 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్‌ ద్వారా రిజర్వాయర్లను నింపుతారు. ఒక్కో మోటార్‌ బరువు 550 టన్నులు ఉంటుంది. వీటి కెపాసిటీ 145 మెగావాట్లు. మోటార్‌ స్లేటర్‌ బరువు 200 టన్నులు. ఒక్కో పంపు గేటు బరువు 40 టన్నులు. ఇలాంటి అద్భుత ప్రాజెక్టు  (Wonderful Project) ఆవిష్కృతం కావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌కారం లేక‌పోలేదు.

Also Read : BJP vs BRS : కవిత ఈడీ నోటీసుల కామెంట్స్ పై బండి సంజయ్ కౌంటర్

నార్లపూర్‌ పంప్‌హౌస్ వ‌ద్ద శ‌నివారం నిర్దేశించిన ముహూర్తం ప్ర‌కారం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కంట్రోల్‌ స్టేషన్‌ మోటార్ స్విచాన్ చేస్తారు. కలశాలతో ప్రతీ ఊరికి కృష్ణమ్మను తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేశారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేకంగా కృష్ణా జ‌లాల‌తో అభిషేకాలు చేసే ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. నార్లపూర్‌ పంప్‌హౌస్‌ ప్రారంభం తర్వాత రిజర్వాయర్ ను పరిశీలించిన అనంతరం భారీ బహిరంగసభలో ఆయ‌న ప్రసంగగిస్తారు.

వాస్త‌వంగా పాలమూరు పక్కనే కృష్ణ పరుగులు తీస్తోంది. అయిన‌ప్ప‌టికీ చుక్కనీరు జిల్లాలోకి వచ్చే సౌక‌ర్యం లేదు. అందుకే క‌రువు జిల్లాగా పాల‌మూరుకు పేరుండేది. ఇప్పుడు పాలమూరే కాదు.. రంగారెడ్డి జిల్లా కూడా సస్యశ్యామలం కాబోతుంది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటే అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. జూరాల ప్రాజెక్టుతోపాటు, చెరువుల ద్వారా రెండులక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు నిర్మాణంకు ప‌రోక్షంగా జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌హ‌కారం ఉంది. కృష్ణా బోర్డు కు ఎప్పుడూ ఈ ప్రాజెక్టు  (Wonderful Project) నిర్మాణం మీద ఏపీ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేయ‌లేదు. ఒక వేళ చేసినా నామ‌మాత్రపు స్పంద‌న‌లా ఉండేది. ఇదంతా అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఉండే కేసీఆర్, జ‌గ‌న్ చ‌లువే.

Also Read : Eelection in April : KCR కు అంతుబ‌ట్ట‌ని BJP స్కెచ్!  

తెలంగాణ సీఎం కేసీఆర్ కార‌ణంగా ఏపీకి ఏమైనా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెచ్చుకున్నారా? అంటే 6వేల విద్యుత్ బ‌కాయిల‌ను కూడా రాబ‌ట్ట‌లేక‌పోయార‌ని ఏపీ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. పైగా తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే, ఏపీలో 100 ఎక‌రాలు కొనుగోలు చేసేలా అభివృద్ధి చేశాన‌ని కేసీఆర్ చెబుతున్నారు. అయినప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో ఏ మాత్రం స్పంద‌న లేదు. ఉమ్మ‌డి ఆస్తుల‌ను పంచుకోవ‌డానికి కూడా ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. షెడ్యూల్ 9, 10లోని సుమారు 6ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే ఉమ్మ‌డి ఆస్తుల‌ను పంచుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా ఉంది. తెలంగాణ‌, హైద‌రాబాద్ కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేస్తోన్న త్యాగం మ‌రువ‌లేనిది. ఇదే విష‌యాన్ని ఏపీ స‌మాజం చెప్పుకుంటోంది. ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్ , బెంగుళూరులో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ గురించి ఎందుకు ప‌ట్టించుకుంటార‌ని టీడీపీ నిల‌దీస్తోంది. ఏదేమైనా కేసీఆర్ చ‌తుర‌త ఆంధ్రాను ఎడారిగా తెలంగాణ‌ను స‌మ‌స్య‌శ్యామ‌లంగా మార్చుతుంద‌న‌డంలో నిజం లేక‌పోలేదు.