Site icon HashtagU Telugu

Ambati Rambabu : రిషికొండను కూడా కూలుస్తావా చంద్రబాబు – అంబటి రాంబాబు

Rambabu Rishikonda

Rambabu Rishikonda

వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)..సీఎం చంద్రబాబు (CM Chandrababu) పై విరుచుకపడ్డారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై పలు ప్రశ్నలు సంధించారు. “మీరు తమ భవనాలను కూల్చినట్లే రిషికొండను కూడా కూలుస్తావా?” అంటూ సూటి ప్రశ్న సంధించారు. రిషికొండ భవనాలు అద్భుతంగా ఉన్నాయని చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు..అలాంటి భవనాలు అమరావతిలో నిర్మించలేకపోవడం పట్ల చంద్రబాబు సిగ్గుపడాలని సూచించారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు గొప్ప భవనాలను నిర్మించారు” అని కొనియాడారు. ఇదే సందర్బంగా లోకేష్ రెడ్ బుక్ పై కూడా రాంబాబు సెటైర్లు వేశారు. లోకేష్ “రెడ్ బుక్కు కు కుక్కలు కూడా భయపడవు” అన్నారు.

శనివారం చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం పరవాడ నుంచి నేరుగా రుషికొండకు చేరుకున్నారు బాబు. రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గత వైసీపీ ప్ర‌భుత్వం రుషికొండ‌ (Rushikonda Palace)పై రూ. 500 కోట్ల‌తో విలాస‌వంత‌మైన భ‌వనాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఎమ్మెల్యే గంటా మీడియాతో క‌లిసి వెళ్లి లోప‌ల ఎలాంటి నిర్మాణాలు జ‌రిగాయి? అస‌లు ఎంత ఖ‌ర్చు పెట్టారు లాంటి విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేశారు.

అయితే మాజీ సీఎం జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ భ‌వ‌నాల నిర్మాణాల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వానికి ఖ‌ర్చు త‌గులుతోంది. ఇప్పుడు ఖ‌ర్చుని ఎలాగైన త‌గ్గించుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ రుషికొండ భ‌వ‌నాల‌ను కేవ‌లం బ‌య‌ట‌నుంచి మాత్ర‌మే ప‌రిశీలించారు. తాజాగా మంత్రి, ఎమ్మెల్యేతో క‌లిసి ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు ఈ భ‌వ‌నాల‌ను ఏం చేయాలో చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌శ్నించారు.

అయితే కొంద‌రు ఈ భ‌వ‌నాల‌ను ఆస్ప‌త్రిగా మార్చాల‌ని స‌ల‌హా ఇస్తుంటే.. మ‌రికొంద‌రు విద్యా సంస్థ‌లుగా మార్చాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. టూరిస్ట్ స్పాట్‌గా చేస్తే మంచి ఇన్ క‌మ్ వ‌స్తుంద‌ని మ‌రికొంద‌రు నిపుణులు కూట‌మి ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇస్తున్నారు. అయితే దీనిపై మెజార్టీ ప్ర‌జ‌ల అభిప్రాయం సేక‌రించిన త‌ర్వాత రుషికొండ ప్యాలెస్‌పై కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ రుషికొండపై నిర్మించిన భ‌వ‌నాల‌ను సినిమా షూటింగ్‌లకు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు తొలుత వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ భ‌వ‌నాల‌పై ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తాజాగా సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను బట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే త్వ‌ర‌లోనే ఈ భ‌వ‌నాల‌పై కూట‌మి పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ భ‌వ‌నాల‌పై సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read Also : BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్‌ షా