Site icon HashtagU Telugu

YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్

Will Win Again And Take Oat

Will Win Again And Take Oat

 

 

YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదివరకు కూడా సీఎం జగన్ చాలాసార్లు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖలో జరిగిన కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ.. తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని అన్నారు. కానీ ఇప్పటివరకూ అది జరగలేదు. గత ఏడాది డిసెంబర్ లోపే షిఫ్ట్ అవుతానన్న ఆయన.. అలా చెయ్యలేకపోయారు. కారణం.. అమరావతి అంశం కోర్టుల్లో ఉంది. కోర్టు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, అప్పుడు ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలన సాగించడం కష్టమవుతుంది. అందువల్ల కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని జగన్ భావిస్తున్నారు. నెక్ట్స్ ఎన్నికల్లో గెలవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చి, విశాఖ నుంచి పాలన సాగించాలని ప్లాన్ వేసుకున్నట్లు ఆయన తాజా మాటలనుబట్టీ అర్థమవుతోంది.

read also : AP : జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాలా! – నారా లోకేష్