ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పింఛన్‌దారులకు (Pensioners) గుడ్‌న్యూస్ అందించబోతున్నట్లు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పింఛన్లను భారీగా పెంచింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, హెచ్‌ఐవీ బాధితులు వంటి అనేక కేటగిరీలకు ఇచ్చే పింఛన్‌ను రూ. 3 వేల నుండి రూ. 4 వేలకు పెంచింది. దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచగా, పూర్తిగా అస్వస్థతకు గురైనవారికి ఇది రూ. 15 వేల వరకు పెరిగింది.
Suchata Chuangsri : నా సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న మిస్ వరల్డ్ 2025 సుందరి
అలాగే ప్రతి నెలా మొదటి తేదీనే పింఛన్లను అందజేస్తోంది. ఒకటో తేదీ సెలవు అయితే ముందురోజే పంపిణీ జరగుతోంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CHandrababu) స్వయంగా పాల్గొనడం విశేషం. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పింఛన్‌దారులకు మరింత సహాయం చేయడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందని చెప్పారు. మొత్తం 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్టు తెలిపారు. భగవంతుడు దయతలిస్తే భవిష్యత్తులో మరోసారి పింఛన్లను పెంచే (Pension Increase) అవకాశముందని తెలిపారు. ఈ మాటలు లబ్దిదారులలో నూతన ఆశలు రేపుతున్నాయి. దేశంలో ఏపీ కంటే ధనిక రాష్ట్రాలు ఉన్నా, ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడంలో ఏపీదే ముందంజ అని సీఎం చెప్పారు. ఇప్పటికే ఉన్న పెంపుతో పాటు భవిష్యత్‌లో మరింత పెంపు ఉంటుందన్న సంకేతాలతో పింఛన్‌దారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.