AP Politics: మెగా రూట్‌! వైసీపీలోకి `గంటా`? వైజాగ్ రాజ‌ధానికి మ‌ద్ధ‌తుగా.!

ఎప్పుడు ఏ పార్టీ పంచ‌న చేర‌తాడో తెలియ‌ని లీడ‌ర్ గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్త‌రం టీడీపీ ఎమ్మెల్యేగా ప్ర‌స్తుతం ఉన్నారు. ఇటీవ‌ల విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ను వ్య‌తిరేకిస్తూ రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపిన చ‌మ‌త్కారి. త్వ‌ర‌లో వైసీపీలోకి వెళ్ల‌బోతున్నాడ‌ని టాక్‌.

  • Written By:
  • Updated On - November 26, 2022 / 02:53 PM IST

ఎప్పుడు ఏ పార్టీ పంచ‌న చేర‌తాడో తెలియ‌ని లీడ‌ర్ గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్త‌రం టీడీపీ ఎమ్మెల్యేగా ప్ర‌స్తుతం ఉన్నారు. ఇటీవ‌ల విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ను వ్య‌తిరేకిస్తూ రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపిన చ‌మ‌త్కారి. త్వ‌ర‌లో వైసీపీలోకి వెళ్ల‌బోతున్నాడ‌ని టాక్‌. అందుకు డిసెంబ‌ర్ ఒక‌టో తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారని ఆయ‌న అనుచ‌రుల్లోని వినికిడి. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించిన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ సెకండాఫ్ మీదుగా జ‌న‌సేన‌కు చేరుతుంద‌ని భావించారు. కానీ, వ‌యా వైసీపీ వైపు ఆయ‌న ప్ర‌యాణం మ‌ళ్లడంపై విశాఖ జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస‌రావు వైసీపీలో చేర‌తార‌ని రెండేళ్ల క్రిత‌మే వినిపించింది. ఆ విష‌యాన్ని అప్ప‌ట్లో ఉత్త‌రాంధ్ర ఇంచార్జిగా ఉన్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా చెప్పారు. మూడు రాజధానుల‌కు మ‌ద్ధ‌తు తీర్మానం చేయాల‌ని ఒకానొక సంద‌ర్భంలో `గంటా` టీడీపీ అధిష్టానం వ‌ద్ద ప్ర‌స్తావించారు. కానీ, అమ‌రావ‌తి రాజ‌ధాని స్టాండ్ మీద టీడీపీ ఉంది. ఆ త‌రువాత విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని వ్య‌తిరేకిస్తూ స్వ‌తంత్ర్యంగా పోరాడుతాన‌ని వెల్ల‌డించి, సైలెంట్ గా ఉన్నారు. బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌వేసిన జాబితాలో ఉన్న పారిశ్రామిక‌వేత్త ఆయ‌న‌. ఇటీవ‌ల ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌డానికి బ్యాంకు అధికారులు ప్ర‌య‌త్నం చేశారు.

Also Read:  AP Govt: ఏపీ పోలీసుల ఏసుక్రీస్తు బాట‌, చ‌లాన్ల వెనుక బోధ‌న‌లు!

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత స‌న్నిహితునిగా గంటా శ్రీనివాస‌రావు మెలుగుతుంటారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి చ‌ర్చించ‌డానికి ఇటీవ‌ల చిరంజీవితో ఆయ‌న భేటీ అయ్యార‌ని టాక్‌. ఆ సంద‌ర్భంగా జ‌న‌సేన‌లోకి `గంటా` వెళ‌తార‌ని ప‌లువురు భావించారు. తాజాగా మ‌రోసారి మెగాస్టార్ తో భేటీ అయిన త‌రువాత ఆయ‌న మ‌నసు మార్చుకున్నార‌ని తెలుస్తోంది. మెగాస్టార్ సూచ‌న మేర‌కు వైసీపీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తాజా టాక్‌. రెండేళ్ల క్రితం వైసీపీ పంచ‌న చేర‌డానికి ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న అవంతి అడ్డుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మారిన పరిణామాల క్ర‌మంలో గంటా శిష్యుడుగా పేరున్న పంచ‌క‌ర్ల ర‌మేష్ కు వైసీపీ విశాఖ‌ ప‌గ్గాల‌ను అప్ప‌గించింది. దీంతో ఆ పార్టీలో చేర‌డానికి గంటా శ్రీనివాస‌రావుకు లైన్ క్లియ‌ర్ అయింద‌ని తెలుస్తోంది.

అయితే, ప్ర‌స్తుతం విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జిగా రాజు ఉన్నారు. ఆయ‌న్ను కాద‌ని గంటాకు సీటు ఇచ్చేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధంగా లేన‌ప్ప‌టికీ మెగాస్టార్ చిరంజీవి స‌ల‌హా మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో కండువా కంపించుకోవ‌డానికి సిద్ధం అయిన‌ట్టు స‌మాచారం. డిసెంబర్ తొలి వారంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైసీపీలోకి గంటా వెళ్ల‌నున్నారు. ఆయ‌న చేరిక‌ను విశాఖ రాజ‌ధాని నినాదానికి అనుకూల నినాదంగా వైసీపీ తీసుకోబోతుంది.

Also Read:  Vijay Sai Reddy : సాయిరెడ్డి ఫోన్ ర‌గ‌డ‌, సోష‌ల్ మీడియాలో విచిత్ర పోల్!