ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రతి రోజు ఎక్కడో చోట భార్య చేతిలో భర్త హతం అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు ఇలాంటి ఘటనలు జరుగగా..తాజాగా మరో ఉదంతం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా (wife kills Husband anantapur) అక్కంపల్లి–రాచానపల్లి రోడ్డులో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న సురేష్‌బాబు (43) తన భార్య అనిత (37), ఆమె ప్రియుడు బాబా ఫక్రుద్దీన్ (34) చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించడం విశేషం.
Obesity : ఊబకాయంతో బాధపడేవారికి గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త మెడిసిన్
సురేష్‌బాబు భార్య అనితకు పండ్లు అమ్మే ఫక్రుద్దీన్‌తో సంబంధం ఏర్పడింది. వారి పరిచయం వివాహేతర బంధంగా మారిందని పోలీసులు వెల్లడించారు. భర్త అనుమానం పెరిగిన తర్వాత తరచూ తాగి వచ్చి అనితను వేధించేవాడట. ఈ బాధల్ని ఫక్రుద్దీన్‌కు వివరించిన ఆమె, భర్తను చంపితే సుఖంగా జీవించొచ్చని చెప్పి ఒత్తిడి చేసింది. రాత్రికి ఇంటికి తిరిగొచ్చే సమయాన్ని లక్ష్యంగా తీసుకుని హత్యకు ప్లాన్ చేసింది. ఫక్రుద్దీన్ రాత్రి 11 గంటల సమయంలో మార్గ మధ్యలో సురేష్‌బాబుపై దాడి చేసి సీసాతో గుద్ది, స్క్రూడ్రైవర్‌తో పొడిచి, అనంతరం బండరాయితో తలపై మోది హతమార్చాడు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన అనంతపురం ఎస్పీ పి. జగదీశ్ ప్రత్యేక బృందాలను నియమించి విచారణ చేపట్టారు. రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్ నేతృత్వంలోని పోలీస్ బృందం నిందితుల్ని కేవలం ఆరు గంటల్లోనే అరెస్ట్ చేయడంలో విజయం సాధించింది. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ ప్రశంసించారు.