Site icon HashtagU Telugu

Chandrababu : ఈ వయసులో చంద్రబాబు రాజకీయాలు ఎందుకు.. ? మాజీ మంత్రి పేర్ని నాని

Perninani Cbn

Perninani Cbn

తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాదం (Tirumala Laddu) విశిష్టతను ఏపీ సీఎం చంద్రబాబు (CM CHandrababu) అపవిత్రం చేసినందుకు గానూ ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలనీ..అందరు గుడిలకు వెళ్లి పూజలు చేయాలనీ జగన్ (Jagan) పిలుపునివ్వడం తో ఈరోజు వైసీపీ నేతలంతా గుడిబాట పట్టారు. విజయవాడలో దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని పూజలు చేశారు. తిరువూరులో స్వామిదాస్‌, కడపలో రవీంద్రనాథ్‌ పూజలో పాల్గొన్నారు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కళావతి ప్రత్యేక పూజలు జరిపించారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చంద్రబాబు ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ఈ వయసులో రాజకీయాలు ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్‌ను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర పన్నారని విమర్శించారు. తెలిసి తెలిసి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, అధికారులు తలో మాట చెబుతున్నారని అన్నారు. ఏ తప్పు జరగకపోయినా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. జగన్‌ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్‌ అనేకసార్లు దర్శనం చేసుకున్నారని తెలిపారు. తిరుమలకు వచ్చే వారందరి నుంచి డిక్లరేషన్‌ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

Read Also : Rajya Sabha Offer : మెగా బ్రదర్ కు రాజ్యసభ సీటు ఖరారు..?