YV Vikrant Reddy : ‘‘కాకినాడ పోర్టు డీల్‌లో విక్రాంత్ రెడ్డే కర్త, కర్మ, క్రియ’’ అని బుధవారం రోజు వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఎవరీ విక్రాంత్ రెడ్డి ? ఆయనపై ఉన్న అభియోగాలు ఏమిటి ? చూద్దాం..
Also Read :Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు
విక్రాంత్ రెడ్డి ఎవరు ? అభియోగాలు ఏమిటి ?
- వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంది.
- ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.
- వైఎస్సార్ సీపీ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏకైక కుమారుడే విక్రాంత్ రెడ్డి.
- వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత విజయమ్మ, షర్మిల వైపు సుబ్బారెడ్డి నిలబడ్డారు. దీంతో జగన్ కూడా వాళ్లను కొంతకాలం పాటు దూరం పెట్టారు.
- ఆ తర్వాత పరిణామాలు మారాయి. రాజకీయ సమీకరణాల రీత్యా వైవీ సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డిలు జగన్‌కు సన్నిహితులుగా ఎదిగారు.
- తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాలను అరబిందోకు విక్రాంత్ రెడ్డి రాయించారని గతేడాది డిసెంబరులో పోలీసులకు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఫిర్యాదు ఇచ్చారు. కాకినాడ పోర్టులోని దాదాపు 41.12 శాతం వాటాను ఈవిధంగా బదలాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- ఈక్రమంలో హైదరాబాద్‌లోని వైవీ నివాసంలో పలుసార్లు శరత్‌చంద్రారెడ్డి, కేవీ రావుతో విక్రాంత్‌రెడ్డి చర్చించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- ‘‘కేవీరావు, వైవీ సుబ్బారెడ్డి అత్యంత అప్తులు. అమెరికాకు వెళ్లినప్పుడల్లా కేవీరావు ఇంట్లోనే వైవీ సుబ్బారెడ్డి ఉంటారు’’ అని బుధవారం రోజు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
- మొత్తం మీద ఈ కేసులో ఏ 1 నిందితుడిగా వైవీ విక్రాంత్‌రెడ్డి ఉన్నారు. ఏ2 నిందితుడిగా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్‌చంద్రారెడ్డి, ఏ4గా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, ఏ5గా అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి.