ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ మరియు మండలిలో (AP Assembly and Council) విప్ (Whips) లను ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులు వ్యవహరించనుండగా, శాసనమండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఈ కొత్త విప్ ల ఎంపికలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి ఏపీ అసెంబ్లీలో అవకాశం కల్పించారు. అలాగే మండలిలో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఏపీ అసెంబ్లీలో :
టీడీపీ నుంచి : బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా. థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు.
జనసేన నుంచి: బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్.
బీజేపీ నుంచి: ఆదినారాయణ రెడ్డి.
శాసనమండలిలో :
టీడీపీ నుంచి : వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్.
జనసేన నుంచి: పిడుగు హరిప్రసాద్. ఈ నియామకాలు పార్టీలకు శాసనసభ మరియు మండలిలో వారి వైఖరిని పటిష్టం చేసేందుకు, పార్టీ క్రమశిక్షణను అమలు చేయడంలో సహాయపడతాయి.
అధికారం అంటే ఆధిపత్యం చెలాయించడం కాదు, నమ్మి గెలిపించిన ప్రజల సేవకు పునరంకితం అని చేతలతో నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వం చీఫ్ విప్‌గా గురుతర బాధ్యతలు అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారు, మంత్రివర్యులు శ్రీ… pic.twitter.com/V1PdKGqOKE
— GV Anjanneylu (@gvanjanneylu) November 12, 2024
Read Also : BJP Leaders Padayatra : పాదయాత్రకు సిద్ధం అవుతున్న తెలంగాణ బిజెపి నేతలు