Whats Today : కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఈ మీటింగ్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు.
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌ను హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ ఈ టికెట్ రేసులో ఉన్నారు.
- బీజేపీ జాతీయ స్థాయి అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు ఇవాళ సాయంత్రం ఆ పార్టీ తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో అగ్రనేతలతో కీలక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలోని మిగతా నియోజకవర్గాల కోసం అభ్యర్థుల ఎంపికపై ఇందులో క్లారిటీ రానుంది.
We’re now on WhatsApp. Click to Join.
- నారా భువనేశ్వరి బస్సు యాత్రలో భాగంగా ఈరోజు నుంచి చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన పాకాల మండలం నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శిస్తారు.
- ఈరోజు నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుంధతి మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.