Site icon HashtagU Telugu

AP Politics : రేపు మ.12 గంటలకు ఏపీలో ఏం జరగబోతుంది..?

Tdp Ycp Tweets

Tdp Ycp Tweets

రేపు ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఏంజరగబోతుంది..? అధికార పార్టీ కూటమి (TDP), గత వైసీపీ ప్రభుత్వం (YCP) ఇద్దరు పోటాపోటీగా ట్వీట్స్ (Tweets) చేయడం దేనికి సంకేతం..? ఇరు పార్టీలు దీనిగురించి ట్వీట్ చేసాయి..? ఇరువురికి ఏ ఆధారాలు లభించాయి..? ఇందుకు సై అంటూ ఒకరికారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ ముందుగా టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘Truth Bomb Dropping’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా ఇరు పార్టీల పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? ఏంజరగబోతుంది..? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన చేయబోతుందా..? ఒకవేళ చేస్తే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లేదా మంత్రులు కానీ తెలియజేస్తారు. ఇలా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేయరు కదా..? ఏంటి ఈ ట్వీట్ వెనుక రహస్యం అని అంత బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరి ఎలాంటి షాక్ ఇస్తారో ఇరు పార్టీలు చూడాలి.

Read Also : NCP : మహారాష్ట్ర ఎన్నికలు..అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఎన్సీపీ