Car Door Lock: కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక నలుగురు చిన్నారులు చనిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం రూరల్ మండలం ద్వారపూడిలోని మహిళా మండలి కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న కారులో ఈ ఘోరం జరిగింది. దీంతో చిన్నారులు కంది మనేశ్వరి (6), బూర్ల చారులత (7), బూర్ల జాస్రిత (8), పంగి ఉదయ్ (7) ప్రాణాలు విడిచారు. ఈ పిల్లలు ఆడుకుంటూ.. పార్క్ చేసి ఉన్న కారును చూశారు. దానికి డోర్ లాక్ చేసి లేదు. దీంతో పిల్లలు అందులోకి ఎక్కారు. ఆ తర్వాత ఆటోమేటిక్ డోర్‌లాక్ పడిపోయింది. ఆ తర్వాత పిల్లలు కారు డోర్ తీసేందుకు యత్నించినా అది ఓపెన్ కాలేదు. దీంతో అందులోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఈవిధమైన ఘటనలు ఇటీవల కాలంలో మనదేశంలో చాలానే చోటుచేసుకున్నాయి.
Also Read :Snoring Husbands: గురక పెట్టే భర్తలపై ‘పూరి మ్యూజింగ్స్’.. స్లీప్ డివోర్స్ సీక్రెట్స్ ఇవిగో
లాక్ చేసిన కారులో.. ఏమవుతుంది ?
- కారు డోర్లు, కిటికీలను క్లోజ్ చేసి లాక్ చేస్తే.. బయటి గాలి కారు(Car Door Lock) లోపలికి రాదు.
- ఇలాంటప్పుడు కారులో ఎవరైనా ఉంటే.. క్రమంగా కారులో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఊపిరాడదు.
- కారు లోపల ఉన్నవారికి తల తిరుగుతుంది.
- తల తిరగడం పెరిగి ఊపిరాడక.. కారులో ఉన్నవారు చనిపోతారు.
- అందుకే కార్లలో, ఇతర వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.
- కార్లను లాక్ చేసే ముందు..ఆ వాహనంలో ఎవరైనా ఉన్నారా అనేది చెక్ చేయాలి.
Also Read :All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
కారు పార్కింగ్.. ఇవి గుర్తుంచుకోండి
- మనం కారును పార్క్ చేస్తే, తప్పకుండా లాక్ చేయాలి. కారులో పిల్లలు, ఇతర విలువైన వస్తువులు లేవని కన్ఫర్మ్ చేసుకోవాలి.
- పల్లపు ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలు అకస్మాత్తుగా కదిలే అవకాశం ఉంటుంది.
- సందుల్లో,చిన్న చిన్న రోడ్లపై అడ్డదిడ్డంగా కార్లను పార్క్ చేసినా ప్రమాదాలు జరుగుతాయి.
- కారు లాకింగ్, అన్ లాకింగ్, హారన్ ప్రెస్సింగ్ వంటి విషయాలపై పిల్లలకు ప్రాథమిక విషయాలను నేర్పించాలి.
- కొత్తగా వస్తున్న కార్లను ఫోన్‌లోని యాప్ ద్వారా అన్ లాక్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి ఉంచుకోవాలి.