ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు నియంతృత్వ పాలనలో తీవ్రంగా నలిగిపోయారని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు ప్రజలకు ఊపిరిపీల్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్డీయే కూటమి విజయం ప్రజల ఆశయాలను ప్రతిబింబించిందని, పాలనలో పారదర్శకతకు, ప్రజాస్వామ్యానికి నాంది పలికిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రగతి నివేదిక(Pragathi Nivedika)ను విడుదల చేశారు.
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా పూర్తి మద్దతుగా ఉందని తెలిపారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టి, పాలనాపరమైన నైపుణ్యం రాష్ట్రాన్ని పురోగతికి నడిపిస్తోందన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచితే, ఇప్పుడు తాము ఆర్థిక పునరుత్తానానికి మార్గం వేస్తున్నామని పవన్ వివరించారు.
రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి, పారదర్శక పాలనకు చిరునామాగా మారుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల అభ్యున్నతికి సంకల్పబద్ధంగా పనిచేస్తామని పేర్కొన్నారు. “ప్రజల ఆకాంక్షలే మా దిక్సూచి. ఆ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రతి నిర్ణయం తీసుకుంటాం” అంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.