Bandi Sanjay : ఏపీలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం ఏపీలో వచ్చిందని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు ఖత సమాప్తం అయిందని పేర్కొన్నారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని సంజయ్ ఆరోపించారు. పుట్టినరోజు సందర్భంగా గురువారం రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్(Bandi Sanjay).. మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయిందని ధ్వజమెత్తారు.
We’re now on WhatsApp. Click to Join
వైఎస్సార్ సీపీ హయాంలోని పాలకులను వీరప్పన్ వారసులతో బండి సంజయ్ పోల్చారు. గత ఏపీ పాలకులు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని, ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చి చెప్పారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ(BJP) నాయకులు అనేక పోరాటాలు చేశార్నారు. కాగా, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read :Citibank – Axis Bank : జులై 15.. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లూ బీ అలర్ట్
‘‘మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కానీ హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేసి సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఊరుకోం’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘కొంతమంది ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో వేల కోట్లు సంపాదించారు. పార్టీలు నడవాలన్నా.. ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి వాళ్లు దిగజారారు. చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారు’’ అని ఆయన ఆరోపించారు.