చంద్రబాబు (Chandrababu) అంటే ఏంటో..? అయన విజన్ ఎలా ఉంటుందో..? బాబు పాలన అంటే ఎలా ఉంటుందో..? బాబే కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారో..? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బాబు శక్తి ఏంటో పదే పదే ఎందుకు చెపుతుంటారో..ఇప్పుడు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా అర్ధం అవుతుంది. పాలనలో బాబు తన మార్క్ మరోసారి చూపిస్తూ అన్ని రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకునేలా చేస్తున్నాడు.
చంద్రబాబు నాయుడు ఒక ప్రతిభావంతమైన రాజకీయ నాయకుడు, పాలనాశక్తి కలిగిన వ్యక్తి. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన తన కృషితో హైదరాబాదును సాంకేతిక రంగంలో అభివృద్ధి చేసిన ముఖ్య వ్యక్తులలో ఒకరు. ముఖ్యంగా 1990లలో హైటెక్ సిటీ స్థాపన ద్వారా హైదరాబాద్‌ను ఐటి రంగంలో ప్రధాన కేంద్రంగా మార్చడానికి కృషి చేశారు. ఆయన చేసిన కృషి వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా హైద్రాబాద్కు గుర్తింపు లభించింది.
చంద్రబాబు ఐటి, డిజిటల్ యుగంలో ముందంజలో ఉండేందుకు దృఢంగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చి, జీ–ఐఎస్ సాంకేతికతలను వినియోగించారు. ప్రభుత్వం, బహిరంగ సేవల్లో పారదర్శకత తీసుకురావడం, గవర్నెన్స్ మోడర్నైజేషన్ (E-Governance) ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ప్రపంచ స్థాయి కంపెనీలను ఆహ్వానించడంతో పాటు, గ్లోబల్ నాయకులతో సంబంధాలు బలోపేతం చేసి, వాణిజ్య మార్గాలను పెంచారు. దీని ఫలితంగా, బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించాయి. అమరావతి రాజధాని ప్రాజెక్టు, పోలవరంలాంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సుశక్తంగా నిర్మించాలన్న దృక్పథాన్ని కలిగించారు. ఇలా ఎన్నో చేసి, చూస్తూ తమ మార్క్ చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ సీఎం గా తన మార్క్ పాలన కనపరుస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోసారి ప్రజల మనిషి అనిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టిన ఆయన..తాజాగా ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్లో జొన్నలను కూడా చేర్చారు. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా చంద్రబాబు ఇస్తుండడం తో మిగతా రాష్ట్రాల ప్రజలు..ఏపీ సీఎం ను చూసి నేర్చుకోవాలని తమ సీఎం లు అని మాట్లాడుకుంటున్నారు.
Read Also : Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్ కుమార్ విమర్శలు