ఏపీ(AP)లో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల (Lok Sabha & Assembly Election) బరిలో బిజెపి (BJP) ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు అర్ధమవుతుంది. మొన్నటి వరకు జనసేన – టీడీపీ (Jansena-BJP) కూటమి తో బిజెపి కూడా కలవబోతుందని అంత అనుకున్నారు కానీ..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేన – టీడీపీ లు మాత్రమే కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. అలాగే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది కూడా ఇరు నేతలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. నిన్న ఆదివారం అభ్యర్థుల స్థానాలపై ఇరు నేతలు దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిపి ఓ ఫిగర్ ను వచ్చారు. ఇదే క్రమంలో బిజెపి తో ఎలాంటి పొత్తు లేకుండా అసెంబ్లీ , పార్లమెంట్ బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి హావ పెద్దగా కనిపించడం లేదు..రాష్ట్ర ప్రజలు సైతం కేంద్ర తీరు ఫై ఆగ్రహంతో ఉన్నారు. విభజన, ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ద్రోహం చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే… మూడు పార్టీలు నష్టపోతాయనీ…తిరిగి వైసీపీయే అధికారంలోకి వస్తుందని పవన్ కు బాబు వివరించినట్లు తెలుస్తుంది..ఇదే విషయాన్నీ కమలం పార్టీ పెద్దలకు సైతం వివరిస్తున్నారు. బీజేపీతో కలసి వెళ్ళడం టీడీపీ సీనియర్ నేతల్లోను చాలామందికి ఇష్టం లేదు. ఆ పార్టీతో పెట్టుకుంటే ఎన్నికల్లో నష్టపోతామని బాబును హెచ్చరిస్తున్నారు. కొత్తగా పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల, కొత్త పార్టీ పెట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ కూడా … ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో బిజెపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగితే ఇబ్బంది అని బాబు ఆలోచన.
ఏపీలో తమకు ఎన్ని లోక్ సభ సీట్లు వచ్చినా… ఎన్డీఏకు మద్దతు ఇస్తామని టీడీపీ జనసేన… కమలం పార్టీ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బీజేపీ లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ, జనసేన నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే బాబు, పవన్ తాము పోటీ చేసే స్థానాలపై కసరత్తు ప్రారంభించారు.
Read Also : AP : బైబై జగన్ ..జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ?: టిడిపి ఎమ్మెల్యేలు