Jagan Strong Warning: ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan Strong Warning) విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. ఐదు నెలలుగా అన్నివర్గాలను ప్రభుత్వం మోసం చేసింది. ప్రశ్నించేవాళ్లు లేకుండా చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు’’ అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రభుత్వ స్కూల్స్ గాడితప్పాయని మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడారు. ‘‘విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన అందలేదు. వసతి దీవెనను ఇవ్వలేదు. విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2400 కోట్లు దాటాయి. వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’’ అని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. గుంటూరు, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ నేతలు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్ జరిగింది’’ అని దుయ్యబట్టారు. అవినీతిపై ప్రశ్నిస్తే చాలు.. ఇల్లీగల్ డిటెన్షన్‌లు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడ వరదసాయంలో అవినీతిపై, మహిళలపై అరాచకాల గురించి, ఇసుక ధరలు, మద్యం సిండికేట్, తదితర అంశాలపై సోషల్ మీడియాలో నిలదీస్తే.. ఇల్లీగల్ డిటెన్షన్‌లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే కాకుండా.. వేరే పోస్టులను ఫార్వార్డ్ చేసినా కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహించారు.
Also Read: Telangana High Court : మరోసారి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా
తన తల్లి విజయమ్మపై అసత్య వార్తలను టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహించిన జగన్.. తన తల్లిని తాను చంపాలని చూసినట్లు టీడీపీ అఫీషియల్ ఖాతాలో పోస్టు పెట్టారని, వారిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని సూచించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తాము (వైసీపీ) తప్ప వేరే వారు లేరని.. తమను ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. తమను ప్రతిపక్షంగా గుర్తించనపుడు అసెంబ్లీకి వెళ్లి లాభమేంటని అడిగారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదంటే.. మైక్‌ను ఇవ్వబోమని అధికార పక్షం చెప్పినట్లేనని అన్నారు. ప్రశ్నిస్తామనే భయంతోనే తమను ప్రతిపక్షంగా గుర్తించడం లేదని చెప్పారు.
అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి.. తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వెళ్తానని ఆ పార్టీ అధినేత జగన్ వెల్లడించారు. లేనిపక్షంలో అసెంబ్లీ ప్రారంభమైన ప్రతి మూడు రోజులకు ఒకసారి.. మీడియా వేదికగా అధికార పక్షం చేసే తప్పులను ఎండగడతామని చెప్పారు. సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లినా వృథాయేనని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ సీఎం జగన్ ఫైరయ్యారు. తాడేపల్లిలో జగన్ మాట్లాడుతూ.. ‘‘సరస్వతి కంపెనీ కోసం తాను ప్రైవేట్ భూములను తీసుకున్నాను. రైతులు ఎకరానికి రూ.2.70 లక్షలు అడిగితే నేను రూ.3 లక్షలు చెల్లించాను. అటువంటి సరస్వతి భూముల్లోకి పవన్ వెళ్లారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? ఆయన మంత్రి ఎలా అయ్యారో తెలియడం లేదు’’ అని ఆగ్రహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ దుయ్యబట్టారు.