Site icon HashtagU Telugu

Pawan Kalyan : అసెంబ్లీ లోకి ప్రధాన ప్రతిపక్షంగా అడుగు పెడుతున్నాం – పవన్ కళ్యాణ్

Pawan Meets

Pawan Meets

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను మంగళగిరి పార్టీ ఆఫీస్ లు అభినందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటూనే.. విపక్షంగా కూడా కొనసాగుతామని స్పష్టం చేసారు. ముందుగా అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తామని , కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తామని పేర్కొన్నారు. జనసేన ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు పని చేయాలన్నదే తన కోరిక అని అన్నారు. అందుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్‌పైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. ఆ ఆరు అంశాలపైనే ప్రజలకు మొదట భరోసా కల్పించాలని తెలిపారు. నాకు మించిన మెజారిటీ జనసేన అభ్యర్థులకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జనసేన నేతల సమాచారం మేరకు పవన్ ఏపీ రాజకీయాలకే కొంత కాలం పరిమితం కావాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నా..పవన్ ఆ విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో తన పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి..తాను జనసేన అధినేతగా పాలనా వ్యవహారాల్లో చంద్రబాబుకు చేదోడుగా నిలవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఇది ఇంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఢిల్లీ లో NDA సమావేశంలో హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తుంది.

Read Also : Jakkampudi Raja : ధనుంజయ్ రెడ్డి ఓ చెత్త అధికారి – జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు