AP Employees Vs Jagan : టీచ‌ర్లు, ఉద్యోగుల‌తో జ‌గ‌న్ `వార్‌`

టీచ‌ర్లు,ఉద్యోగులు పంతం నెగ్గించుకోవ‌డానికి సిద్ధం అయ్యారు. వాళ్ల‌ను క‌ట్ట‌డీ చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాల‌ను ర‌చించింది. ఆ క్ర‌మంలో టామ్ అండ్ జెర్రీ గేమ్ త‌ర‌హాలో ఏపీ పాల‌న మారింది.

  • Written By:
  • Updated On - September 1, 2022 / 04:33 PM IST

టీచ‌ర్లు,ఉద్యోగులు పంతం నెగ్గించుకోవ‌డానికి సిద్ధం అయ్యారు. వాళ్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాల‌ను ర‌చించింది. ఆ క్ర‌మంలో టామ్ అండ్ జెర్రీ గేమ్ త‌ర‌హాలో ఏపీ పాల‌న మారింది. షెడ్యూల్ ప్ర‌కారం సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన మిలియ‌న్ మార్చ్ ను టీచ‌ర్లు, ఉద్యోగులు నిర్వ‌హించాలి. కానీ, ఆగ‌స్ట్ 31న వినాయ‌క చ‌వితి కార‌ణంగా సెబ్టంబ‌ర్ 11వ తేదీ నాటికి వాయిదా వేసుకున్నారు. సీపీఎస్ ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హించాల‌ని టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన విష‌యం విదితమే. అయితే, గ‌తంలో జ‌రిగిన‌ `చ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మాన్ని గుర్తు చేసుకుంటోన్న ప్ర‌భుత్వం టీచ‌ర్లు, ఉద్యోగుల‌ను వెంటాడుతోంది.

ప్ర‌భుత్వం వ‌ద్దనున్న Software టీచ‌ర్లు, ఉద్యోగుల మొబైల్ క‌ద‌లిక‌ల ద్వారా వాళ్ల‌ను ప‌ట్టేస్తోంది. ప్ర‌స్తుతం పాఠ‌శాల‌ల్లో ఫేస్ రిగ‌గ్నైజేష‌న్ ప‌ద్ధ‌తి కొన‌సాగుతోంది. ఫ‌లితంగా ఎవ‌ర్నైనా వెంట‌నే గుర్తుప‌ట్టే అకాశం ఉంది. అందుకే, టీచ‌ర్లు లాగిన్ వేరే మొబైల్ ద్వారా అవుతున్నార‌ని తెలుస్తోంది. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని మిలియ‌న్ మార్చ్ ను భ‌గ్నం చేయాల‌ని ఏపీ పోలీస్ స‌న్న‌ద్ధం అయింది. అయితే, ఉద్యోగులు అదే సాంకేతిక ప‌రిజ్ఞాన్ని టాంప‌రింగ్ చేయ‌డం ద్వారా మిలియ‌న్ మార్చ్ కు రావాల‌ని ఎత్తుగ‌డ వేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురి టీచ‌ర్లు, ఉద్యోగుల‌కు హౌస్ అరెస్ట్ లు చేయ‌డం జ‌రిగింది.

 

Also Read: AP Employees : టీచ‌ర్లు,ఉద్యోగుల హాజ‌రుకు `ఫోన్ యాప్‌` కొర‌ఢా

 

ఉద్యోగుల్ని అరెస్టులు, కేసుల పేరుతో ప్రభుత్వం వేధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు గురువారం బ్లాక్ డే(విద్రోహ దినం)గా పాటించాలని పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేప‌ట్టారు. సీపీఎస్ రద్దయే వరకూ ఈ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణ‌యించారు. టీచ‌ర్లు, ప్ర‌భుత్వ‌ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళనలకు ఇత‌ర ఉద్యోగ సంఘాలు కూడా మద్దతిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పాలనపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ఉద్యోగుల అరెస్టుల్ని, కేసులతో భయపెట్టడాన్ని విపక్షాలు సీరియ‌స్ గా తీసుకుంటున్నాయి. కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు విపక్ష లీడ‌ర్లు మద్దతు ఇస్తూ టీచ‌ర్లు, ఉద్యోగుల వెంట ఉన్నారు.

 

Also Read: Ananthapuram : ఏపీ పోలీస్ `జంబ‌ల‌క‌డిపంబ`, ఎస్పీపై అట్రాసిటీ కేసు

 

ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తాన‌ని పాదయాత్ర సందర్భంగా జ‌గ‌న్‌ హామీ ఇచ్చారు. మూడేళ్లు అయిన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఆయ‌న ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌లేక‌పోయారు. ఉద్యోగుల ఒత్తిడితో సీఎస్, మంత్రులతో కమిటీలు వేసి చర్చలు జరిపారు. సీపీఎస్ రద్దు చేయడం సాధ్యం కాదని క‌మిటీ తేల్చింది. ప్రత్యామ్నాయాల్ని తెరపైకి తెచ్చిన‌ప్ప‌టికీ ఉద్యోగులు అంగీకరించలేదు. ఇతర రాష్ట్రాల్లో రద్దవుతున్న సీపీఎస్ ఏపీలో మాత్రమే ఎందుకు రద్దు కావడం లేదనే అంశంపై ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. ఉద్యోగులకు ఏం చెప్పాలో జ‌గ‌న్ స‌ర్కార్ కు పాలుపోవడం లేదు.

 

Also Read: AP Politics : ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై లోకేష్ మార్క్‌

 

వాస్తవానికి గురువారం మిలియన్ మార్చ్ పేరుతో విజయవాడలో భారీ సమావేశం నిర్వహించాలని భావించారు. కానీ ప్రభుత్వం ఉద్యోగుల‌ అరెస్టులు, బైండోవర్లు, కేసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా ఆగస్టు 31న పండుగ కూడా రావడంతో ఉద్యోగులు తప్పనిసరి పరిస్ధితుల్లో సెప్టెంబర్ 11కు మిలియ‌న్ మార్చ్ ను వాయిదా వేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ కేసులు, అరెస్టులతో ఉద్యోగుల్ని ప్ర‌భుత్వం వేధిస్తోందని ఉద్యోగ నేతలు చేస్తోన్న ఆరోప‌ణ‌. అందుకే, గురువారం నాడు విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లాల వారీగా ఆందోళ‌న చేస్తున్నారు.