Site icon HashtagU Telugu

AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా

AP MLC Elections 2024

AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్లకు బిగ్ అలర్ట్. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును నవంబరు 20 వరకు పొడిగించారు. వాస్తవానికి ఓటర్ల నమోదు గడువు బుధవారం (నవంబరు 6)తోనే ముగిసింది. అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 25న ఓట్ల వెరిఫికేషన్ ఉంటుంది. డిసెంబరు  30న తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్‌‌ను విడుదల చేస్తారు.

Also Read :Kamal Haasan Birthday : నట ‘కమలం’.. 70వ వసంతంలోకి ‘విశ్వనటుడు’

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఇలా.. 

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే ప్రాంతంలో నివాసిగా ఉండి 2024 నవంబరు 1కి మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులంతా ఓటర్లుగా నమోదుకు అర్హులు.
  • అర్హులైన గ్రాడ్యుయేట్లు ఏపీ సీఈవో అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేయొచ్చు.
  • ఫారం-18ను నింపి, డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఎమ్మార్వో ఆఫీసులో కూడా ఇవ్వొచ్చు.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను ఫారం-18పై అతికించాలి. ఆధార్‌ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికెట్, ఓటర్ ఐడీ జిరాక్స్‌లను జత చేయాలి.
  • అన్ని కలెక్టరేట్లు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంఈవో ఆఫీసులలో దరఖాస్తులను స్వీకరిస్తారు.
  • ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో పట్టభద్రుల నుంచి ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల చివరి వారంలో  ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను విడుదల చేస్తారు.

ఓటు నమోదు ఆన్ లైన్‌లో ఇలా.. 

  • గ్రాడ్యుయేట్ ఓటు నమోదు  కోసం https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఉండే MLC-e Registration అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత గ్రాడ్యుయేట్-18 ఆప్షన్‌పై నొక్కాలి.
  • ఓటర్ ప్రాథమిక వివరాలతో Sign Up చేయాలి.
  • ఆ తర్వాత ఫారం- 18పై క్లిక్ చేయాలి.
  • ఏ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కిందికి వస్తారో అక్కడ క్లిక్ చేయాలి.
  • పూర్తి వివరాలను ఎంటర్ చేసి, విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
  • ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  • సబ్మిట్‌పై నొక్కితే అప్లికేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • రిజిస్ట్రేషన్ నెంబరుతో మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయొచ్చు.