ఆంధ్రోడా నీ ఓటుందేమో (Vote cancellation scam) చూసుకో. ఎన్నికల కమిషన్ ఓట్ల చేర్పులు, మార్పులు చేస్తోంది. ఇదే సమయంలో ఒక సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారు. ఏపీలోని ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన ఈ తతంగాన్ని అక్కడి ఇంచార్జి పయ్యావుల కేశవ్ పట్టుకున్నారు. అదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, లేదంటే ఎన్నికల ముగిసిన తరువాత సారీ చెప్పడం మినహా ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 20లక్షల ఓట్లు తెలంగాణ వ్యాప్తంగా గల్లంతు అయ్యాయి. ఎన్నికల సమయంలో పలు చోట్ల ఓటర్లు ఆందోళన చేసిన క్రమంలో ఎన్నికల కమిషనర్ సారీ చెప్పిన విషయాన్ని గుర్తించుకుని ఆంధ్రా పౌరులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.
ఆంధ్రోడా నీ ఓటుందేమో చూసుకో (Vote cancellation scam)
ప్రతి 50 కుటుంబాలకు ఒకరు వలంటీర్ ఉన్నాడు. అదే విధంగా 50 ఓట్లకు ఒక గృహసారథిని వైసీపీ నియమించింది. వాళ్లకు గ్రామ, వార్డు పరిధిలోని ఓటర్లు ఎవరు ఎటు అనేది తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటర్లను తొలగించే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. కనీసం 60లక్షల ఓట్లను తొలగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీకి పట్టున్న విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40 వేల ఓట్ల తొలగించారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉందంటూ కొన్ని ఓట్లను తొలగిస్తున్నారు. చని పోయారంటూ మరికొన్ని, వలస వెళ్లారంటూ ఇంకొన్ని ఓట్లను తీసేస్తున్నారు. నిబంధనల ప్రకారం నిజంగా తొలగిస్తే అభ్యంతరం లేదు. కానీ, సామాజికవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని గంపగుత్తగా తీసేస్తున్నారని (Vote cancellation scam) ఆందోళన మొదలయింది.
కనీసం 50లక్షల ఓట్లను తొలగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటర్లు, సానుభూతిపరులు, కార్యకర్తలకు సంబంధించిన ఓట్లే తీసేశారు. పలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని చాలా కుటుంబాలకు ఓటే లేకుండా పోయింది. మరికొన్నిచోట్ల కుటుంబంలోని ఒకరి ఓటు ఉంచి మిగతావారివి తీసేశారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లూ కూడా జాబితాలో (Vote cancellation scam) లేకుండా చేశారు. ఒకే కుటుంబంలోని ఒకరి ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోనూ మరికొందరికి వేరే కేంద్రం పరిధిలో చేర్చారు. ఓటరు నమోదుతో పాటుఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, గీత దాటుతున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు.
అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు
ఓట్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఓట్ల తొలగింపుపై దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది. 60లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని లక్ష్యంగా పెట్టినట్టు వైసీపీ వర్గాల్లోని టాక్. ఆ మేరకు ఇప్పటికే ఈ తొలగింపు (Vote cancellation scam) ప్రారంభించారు. గతంలో ఉరవకొండ ఇప్పుడు విశాఖ తూర్పు పరిధిలో గుర్తించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు జరుగుతోంది. ప్రత్యేకించి టీడీపీ ఓటర్లను గుర్తించడం ద్వారా గృహసారథులు తొలగించే పనిలో ఉన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా 20లక్షల ఓట్లను తొలగించడం ద్వారా రెండోసారి కేసీఆర్ సీఎం కాగలిగారని కాంగ్రెస్ అప్పట్లోనే ఆరోపించింది.
Also Read : TDP bus yatra : 125 స్థానాల్లో బస్ యాత్ర, 50 స్థానాలు పొత్తుకేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్పించిన పాఠాన్ని చదవుకుంటోన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గృహ సారథులు, వలంటీర్ల సహాయంతో 60లక్షల ఓట్ల తొలగింపుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ గంపగుత్తగా టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని గుర్తించారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషనర్ కు తెలియచేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : CBN Manifesto 2.0 : టీడీపీ మేనిఫెస్టో 2.0 సిద్ధం! ప్రచారానికి బస్సు యాత్ర!!
40ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు కూడా ప్రస్తుతం వైసీపీ చేస్తోన్న ఓట్ల తొలగింపును పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ప్రతి 50 ఓట్లకు ఒక గృహసారథిని పెట్టడం ద్వారా వైసీపీ యుద్ధ ప్రతిపదికన ఓట్లను తొలగిస్తోంది. కనీసం 60 లక్షల ఓట్లను తొలగించాలని (Vote cancellation scam) ప్రాథమికంగా వైసీపీ టార్గెట్ పెట్టుకుందట. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వలంటీర్లు, గృహసారథులు దూకుడుగా ముందుకు కదులుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓట్ల తొలగింపును అడ్డకునే వ్యవస్థ బలంగా టీడీపీకి లేదు. చంద్రబాబు కూడా ఆ దిశగా దృష్టి పెట్టలేదని టీడీపీలోని హార్డ్ కోర్ టీమ్ ఆందోళన చెందుతోంది.