Site icon HashtagU Telugu

Murder Case : అక్రమ సంబంధం కోసం హత్య చేసిన వాలంటీర్.. సుపారీ ఇచ్చి మరీ..

volunteer murdered a auto driver for illegal affair

volunteer murdered a auto driver for illegal affair

ఇటీవల ఏపీలో పలువురు వాలంటీర్లు(Volunteers) నేరాలు చేస్తున్న వార్తలు ఎక్కువగానే వస్తున్నాయి. కొంతమంది అయితే హత్యలు కూడా చేస్తున్నారు. ఇటీవల వైజాగ్(Vizag) లో ఓ వాలంటీర్ ఓ పెద్దావిడను నగల కోసం హత్య చేయగా తాజాగా మరో వాలంటీర్ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ని హత్య చేయించాడు.

బ్రతుకుతెరువు కోసం కువైట్ కు వెళ్లి ఇటీవలే పీలేరు(Piler)కు వచ్చి ఆటో నడుపుకుంటున్న సుధాకర్ భార్య అశ్విని స్థానిక వాలంటీర్ కిషోర్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో సుధాకర్ వాలంటీర్ కిషోర్ ను ఇటీవల తీవ్రంగా హెచ్చరించాడు. తన భార్యని కూడా హెచ్చరించాడు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న సుధాకర్ ను హత్య చేయాలని వాలంటీర్ కిషోర్ నిర్ణయించుకొని తిరుపతిలో తనకు తెలిసిన ఐదుగురు యువకులకు సుపారీ ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ చేశాడు.

గత నెల 31వ తేదీన సుధాకర్ ఆటో ఎక్కి వెనుక నుంచి అతని మెడపై విషపు ఇంజక్షన్లు ఇచ్చారు ఆ యువకులు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా సుధాకర్ మరణించాడు. భార్య అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పీలేరు పోలీసులు ఘటనపై విచారణ జరిపి హత్యగా తేల్చారు. నేడు మీడియా ముందుకు నిందితులని తీసుకు వచ్చి వాలంటీర్ కిషోర్ సుపారి గ్యాంగ్ తో కలిసి సుధాకర్ ని హత్య చేసినట్లు ప్రకటించారు. దీంతో మరోసారి వాలంటీర్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో గత నెలాఖరున కిషోర్ తన వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడని పోలీసులు చెప్పడం గమనార్హం.

 

Also Read : Maharajganj: మాట మార్చిన అత్యాచార బాధితురాలు